ఎంపీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో వీరబల్లికి సోలార్ వెలుగులు
1 min read
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో: అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం లోని వీరబల్లిమండల కేంద్రంలోని వీరబల్లిలో సోలార్ బల్బులను ఎంపీపీ గాలివీటి రాజేంద్రనాథ్ రెడ్డి ఏర్పాటు చేయడమైనది. ఎంపీపీ ఆదేశాల మేరకు నెట్ కేఫ్ మేనేజర్ ఎర్రం రెడ్డి దాతగా ముందుకు వచ్చి కావలసిన సోలార్ సిస్టం బల్బులను తన సొంత నిధులతో కొనుగోలు చేయడం జరిగింది. వీటిని మండల కేంద్రంలో అవసరమున్న చోట్ల బుధవారం ఏర్పాటు చేయడమైనది. ఈ విషయం తెలుసుకున్న పలువురు ఎంపీపీకి అభినందనలు తెలిపారు.