PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏసీబీ డీఎస్పీ అల్లాబకాష్​కు ఘననివాళి

1 min read

పల్లెవెలుగు వెబ్​, రాయచోటి: రాయచోటి పట్టణం, మాసాపేటకు చెందిన డియస్పి వల్లూరు అల్లాబకష్‌ అనారోగ్యంతో గురువారం తెల్లవారుజామున తిరుపతిలో తుదిశ్వాస విడిచారు. ఈయన చిత్తూరు జిల్లా, తిరుపతి అవినీతి నిరోధక శాఖలో డి.యస్.పి. గా విధులు నిర్వర్తిస్తున్నారు. అల్లాబకష్‌ గత కొన్నిరోజులుగా అనారోగ్యం కారణంగా చికిత్స పొందుతున్నారు, ఆరోగ్యం క్షీణించడంతో ఈ రోజు తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. మరణ వార్త తెలుసుకున్నజిల్లా సూపర్ డెంట్ ఆఫ్ పోలిస్ అన్బురాజన్ ఆయన వెంట రాయచోటి డి.యస్.పి.శ్రీ ధర్ రాయచోటి, రూరల్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ లింగప్ప మాసాపేటలోని డియస్పి స్వగృహంలో అల్లాబకష్‌ కు శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానూభూతిని ప్రకటించారు. అల్లాబకష్‌ విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసేవాడని, మన రాయచోటికి చెందిన ఓ మంచి పోలీసు అధికారిని కోల్పోవడం బాధాకరమని తెలిపారు.

About Author