తహసిల్దార్ వెంకటలక్ష్మికి ఘనసన్మానం
1 min read
పల్లెవెలుగు వెబ్, గూడూరు: గూడూరు మండల తహసీల్దార్‌గా విధులు నిర్వర్తిస్తున్నవెంకటలక్ష్మి ఆదోని తహసీల్దాగా బదిలీపై వెళుతుండటంతో గూడూరు తాసిల్దార్ కార్యాలయం సిబ్బంది, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం తహసీల్దార్ వెంకటలక్ష్మిని శాలువాలు కప్పి పూలమాలలతో ఘనంగా సన్మానించారు. పదవీ బాధ్యతలు చేపట్టిన అనతికాలంలోనే ప్రజాసమస్యలను పరిష్కరించేందుకు ఎంతగానో కృషి చేశారని కార్యాలయ సిబ్బంది ఆమె సేవలను కొనియాడారు. అలాగే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ జెడ్పీటీసీ సభ్యులు వెంకటేశ్వర్లు అధ్వర్యంలో కౌన్సిలర్ సభ్యులు పద్మావతి, దస్తగిం, కో అప్షన్ సభ్యులు రామాంజనేయులు, భాస్కరగాడ్, ఉగ్ర నరసింహులు తాసిల్దార్ వెంకటలక్ష్మిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.