ప్రపంచ ఉక్కు మహిళకు ఘననివాళి : జాన్ విల్సన్
1 min readపల్లెవెలుగు వెబ్, కర్నూలు: ప్రపంచ ఉక్కుమహిళగా పేరుగాంచిన భారతరత్న ఇందిరా గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు దేశంలో ప్రతి ఇల్లూ ఆనందంగా ఉండేదని కర్నూలునగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుజాన్ విల్సన్ గారు ఆమె సేవలను కొనియాడారు. ఆదివారం ఇందిరా గాంధీ 37వ వర్ధంతి, భారత తొలి ఉప ప్రధాని ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 146 వ జయంతిని కర్నూలు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించారు. ముందుగా ఇందిరమ్మ,సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జాన్ విల్సన్ మాట్లాడుతూ ఇందిరా గాంధీ పాలనలో దేశంలో ప్రజలు ఎంతో సుఖ సంతోషాలతో జీవించారని, ఆమె గరీబీ హటావో, బ్యాంకుల జాతీయకరణ, రాజభరణాల రద్దు,అంటరానితన నిర్మూలన మొదలగు ఎన్నో జాతీయ సంస్థలు నెలకొల్పి దేశ ప్రజలను కంటికి రెప్పలా పరిపాలించారని గర్తు చేశారు. ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో పెరిగిన నిత్యావసర ధరలతో గ్యాస్, పెట్రోల్ ధరలతో దేశ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దేశంలో హత్యలు, అత్యాచారాల నియంత్రణలో మోడీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. అలాగే భారత మొదటి ఉపప్రధాని, మొదటి హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్య్ర సమరయోధుడుగా, 1931 సంవత్సరంలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహా సభకు అధ్యక్షత వహించారని, సాహసోపేత నిర్ణయాలతో ఐదువందలకుపైగా స్వదేశీ సంస్థానాలను విలీనం చేసి స్వతంత్ర భారతావనిని ఏకం చేసిన ధీశాలి సర్దార్ వల్లభాయి పటేల్ అని కొనియాడారు. అనంతరం స్థానిక రాజ విహార్ సెంటర్ నందలి శ్రీమతి ఇందిరా గాంధీ గారి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో కోడుమూరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్చార్జి దామోదరం రాధాకృష్ణ, నందికొట్కూరు ఇన్చార్జి సి అశోకరత్నం, ఐఎన్ టియుసి జిల్లా అధ్యక్షులు బి బతుకన్న, కిసాన్ సెల్ అధ్యక్షులు పోతుల శేఖర్, కాంగ్రెస్ డాక్టర్స్ సెల్ అధ్యక్షులు అమరేందర్ రెడ్డి ఎస్సీసెల్ డబ్ల్యూ సత్యరాజ్ మాజీ కార్పొరేటర్ శివానంద్ కాంగ్రెస్ నాయకులు ప్రభాకర్ రెడ్డి బివి సుబ్రహ్మణ్యం ఖాజాహుసేన్ నర్సింహారావు జోసెఫ్ నోయెల్, జాన్ దేవదాసు మహిళాకాంగ్రెస్ వెంకటలక్ష్మి మద్దమ్మ ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.