తాగునీటి సమస్యకు పరిష్కారం.. కొత్త మోటర్ బిగించిన సర్పంచ్
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: గత వారం రోజుల నుండి ఎల్కేతాండ గ్రామంలో మోటర్లు కాలిపోవడంతో తీవ్ర నీటి ఎద్దడి నెలకొనడంతో స్థానికంగా టిడిపి నాయకుడు ట్యాంకర్ తో గ్రామస్తులకు నీటి సరఫరా చేయడం నీటి సమస్యపై రాజకీయంగా దుమారం చెలరేగడంతో సోమవారం ఆర్డబ్ల్యూఎస్ డీఈ బివి మధుసూదన్ .ఏ ఈ పవన్. గ్రామంలో సందర్శించి విచారణ చేశారు అనంతరం కాలిపోయిన మోటార్ స్థానంలో సర్పంచ్ ఆధ్వర్యంలో కొత్త మోటర్ బిగించి నీటి ఎద్దడికి చెక్ పెట్టారు గ్రామంలో ఎటువంటి నీటి ఎద్దడి తలెత్తకుండా సింగిల్ ఫేస్ మోటర్లతో దాదాపు 6 బోర్లు ఉన్నట్టు రోడ్డుపై ఉన్న లైన్ కు అనుసంధానంగా ఉన్న మోటార్ వరుసగా రెండుసార్లు కాలిపోవడంతో ఈ సమస్య తలెత్తినట్టు తమ దృష్టికి రావడంతో వెంటనే సమస్యను పరిష్కరించినట్టు డి ఈ మధుసూదన్ తెలిపారు.