తాగునీటి సమస్యను పరిష్కరించండి ఎద్దడి తలెత్తకుండ చూడండి…
1 min read
ఆలూరు ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్
హొళగుంద న్యూస్ నేడు : హొళగుందలోని ఫిల్టర్ బెడ్ను వరిశీలిస్తున్న అలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి, జడ్పీ చైర్మన్ పాపిరెడ్డి హొళగుంద. గ్రామాలలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండ అవసరమైన చర్యలు తీసుకోవాలని అలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి, జడ్పీ చైర్మన్ పాపిరెడ్డి సూచించారు. శుక్రవారం హొళగుందకు వచ్చిన వారితో వైఎస్సార్సీపీ నాయకులు, గ్రామస్తులు గ్రామంలో తీవ్రమైన నీటి ఎద్దడిని దృష్టికి తీసుకెళ్లారు. కద్దమాగి వద్ద ఉన్న మంచినీటి వధకం నుంచి గ్రామం లోని ఫిల్టరైడ్కు నీరు నక్రమంగ సరఫర కాకపోవడం, గ్రామంలోని జనాభకు తగ్గట్టు సంప్, ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు లేకపోవడం, పైడ్లైన్ నమస్య తదితర కారణాలను మండల కన్వీనర్ షఫీవుల్లాతో పాటు నాయకులు, ఎంపీటీసీలు ఈశా, వంపావతి, కెంచప్ప, రామకృష్ణ, మల్లయ్య, హనుమప్ప, శివన్న, శేక్షావలి తదితరులు ఎమ్మెల్యే, చైర్మన్కు వివరించారు. పై కారణాల వల్ల గ్రామంలో వారానికో సారి నీరు రావడం గగనమైందని, వచ్చినా బోరు నుంచి వదిలే ఉప్పు నీరే వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఎస్ ట్యాంకులో నీరు పుష్కలంగా ఉన్నాయని అయితే వధకం వద్ద తరుచూ విద్యుత్ అంతరాయం కలుగుతుండడం. గ్రామంలో నీటినిల్వ సామర్థ్యం తక్కువ ఉంచడంతో కొద్దీ రోజులుగా సమస్య ఉందని పరిష్కారానికి వన్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అక్కడికొచ్చిన ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ మల్లికార్జునయ్య, ఏఈ రామ్ల చెప్పారు. ఎల్లెల్సీ, నమ్మర్ స్టోరేజ్ ట్యాంకులో మంచినీరున్నా గ్రామంలో నీటి ఎద్దడి తలెత్తుతుందని, ఉప్పు నీరు సమస్య నివారణకు గాను అదనంగా నంప్, ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు, పైర్లైన్కు గాను దాదాపు రూ.15 లక్షలు అవసరం అవుతాయని ఆ నిధులను సమకూర్చాలని నాయకులు కోరగ చైర్మన్ సానుకూలంగా స్పందించారు. అనంతరం ఫిల్టర్టెడ్, సంప్ను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఎస్కే గిరి, కో కన్వీనర్ లక్ష్మన్న, సిందువాక కృష్ణయ్య, గోవిందు, మంజునాయక్ తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం జరిగిన వైఎస్సార్సీపీ నాయకులు శేషవ్స, గాదిలింగ కుమారుల వివాహ వేడుకకు ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి, జడ్పీ చైర్మన్ పాపిరెడ్డి నాయకులు, కార్యకర్తలతో కలిసి హాజరై నూతన వధువరులను ఆశిర్వదించారు.
