4 వ వార్డులోని సమస్యలను పరిష్కరించండి…
1 min read
డి ఎల్ పి ఓ కు వినతి పత్రం ఇచ్చిన 4వ వార్డు యువకులు..
హోళగుంద, న్యూస్ నేడు: హోళగుంద మండల కేంద్రంలోని 4 వార్డులో సమస్యలు ఎక్కడికక్కడ తిష్ట వేసుకుని ఉన్నాయి అని, 4 వ వార్డులో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెదేపా మైనారిటీ సీనియర్ నాయకులు అబ్దుల్ సుబాన్,4 వ వార్డు యువకులు ,తాహేర్,అబూబక్కర్,జాకీర్,మజీద్ తదితరులు డి ఎల్ పి ఓ నూర్జహాన్ కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 4 వ వార్డులోని వీధుల్లో వీధి దీపాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దాదాపు 30 కుటుంబాలు పది సంవత్సరాల క్రితం ఇల్లు నిర్మించుకొని నివసిస్తున్నారని అన్నారు. అధికారులు గత సంవత్సరం స్తంభాలు ఏర్పాటు చేశారు కానీ, ఆ స్తంభాలకు విద్యుత్ కేబుల్ కానీ, వీధి దీపాలు కానీ ఏర్పాటు చేయలేదని అన్నారు. దీనివల్ల రాత్రి సమయంలో వీధులు అంధాకారంగా మారుతున్నాయి అని అన్నారు.సమస్యను అధికారుల దృష్టికి పలుమార్లు విన్నవించిన పట్టించుకోవడంలేదని, ఇప్పటికైనా నాలుగో వార్డు వీధుల్లో వీధి దీపాలు అమర్చాలని డి ఎల్ పి ఓ కు విన్నవించారు. డి ఎల్ పి ఓ నూర్జహాన్ స్పందిస్తూ వెంటనే వీధి దీపాలు ఏర్పాటు చేయాలని సర్పంచ్, పంచాయతీ సెక్రటరీలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో 4 వ వార్డు యువకులు పాల్గొన్నారు.