జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించండి…
1 min readపల్లెవెలుగు వెబ్ వెలుగోడు: రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల వివక్ష చూపిస్తుందని , వారి సమస్యలను పరిష్కరించడం లో విఫలం చెందిందని జర్నలిస్టులు అన్నారు. వెలుగోడు మండలం లోని జర్నలిస్టులు గాంధీ జయంతి సందర్భంగా ఏపీయు డబ్ల్యు జె ఆధ్వర్యంలో సేవ్ జర్నలిజం డే నిర్వహించారు.గాంధీ నగర్ లో గల మహాత్మా గాంధీ విగ్రహానికి తమ డిమాండ్ల తో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. గుర్తింపు కార్డులతో సంబంధం లేకుండా అక్రిడేషన్ లను జర్నలిస్టులoదరికి ఇవ్వాలని , హెల్త్ కార్డులను మంజూరు చేయాలని , జర్నలిస్టుల పై దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించుటకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని , కరోనా తో మరణించిన వారి కుటుంబాలకు వెంటనే ఎక్షుగ్రెసియా చెలించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏపీయు డబ్ల్యు జె జిల్లా కార్యవర్గ సభ్యుడు , విశాలాంధ్ర రఘు రాముడు , ఆంధ్రప్రభ సుల్తాన్ , తెలుగు వార్త నాజీర్ , దేశపోరాటం రాఘవేంద్ర , సూర్య చంద్రశేఖర్, 99 టివి సాబీర్ హుస్సేన్ , స్టార్ టుడే రాజు తదితరులు పాల్గొన్నారు.