NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పట్టణంలో నీటి సమస్యను పరిష్కరించండి

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు పట్టణంలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని కాలనీవాసులతో  కలిసి మంగళవారం  మున్సిపల్  కమిషనర్ సుధాకర్ రెడ్డి కి   ఏపీ రైతు సంఘం నాయకులు పిక్కిలి వెంకటేశ్వర్లు వినతిపత్రం అందజేశారు. అనంతరం పిక్కిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ  పట్టణంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉందని నీటి కొరతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తక్షణమే కమిషనర్  జోక్యం చేసుకొని అన్ని వార్డులను పరిశీలించి తాగునీటి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సోమవారం సాయంత్రం ప్రజా సమస్యలపై తిరుగుతున్న సందర్భంగా పలు కాలనీవాసులు మంచినీటి సమస్య తీవ్రంగా ఉందని చెప్పడంతో మున్సిపల్ కమిషనర్  దృష్టికి తీసుకువచ్చామని  తెలియజేశారు. పట్టణంలో వాల్మీకి నగర్, కుమ్మరి పేట వడ్డేపేట గాంధీనగర్ ఎస్ఎస్ఆర్ నగర్ లో ట్యాంక్ లు ఉన్న మోటార్లు రిపేర్లు కావడంతో నీరు వచ్చే పరిస్థితి లేదన్నారు. దీనికి తోడు ఎస్ ఎస్ ఆర్ నగర్ లో బోరు ఉన్న రిపేర్ చేయకపోవడంతో ఆ కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు .ట్యాంకర్ల ద్వార నీటి సరఫరా చేస్తామని కమిషనర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలోఏపీ రైతు సంఘంటౌన్ నాయకులు  రామకృష్ణ, ఉపేంద్ర, భాస్కర్ గౌడ్, కాలనీవాసులు మల్లేశ్వరమ్మ ,రమణమ్మ, మరియమ్మ ,సోఫా బి,  శాలివి, వెంకటస్వామి,శాలు భాష, చాంద్ బాషా, రాజు తదితరులు పాల్గొన్నారు.

About Author