సమస్యల పరిష్కారం.. గడపగడపతోనే సాధ్యం
1 min read– కర్నూలు శాసనసభ్యులు హఫీజ్ ఖాన్
పల్లెవెలుగు, వెబ్ కర్నూలు: గడపగడపకు మన ప్రభుత్వంలో భాగంగా కర్నూలు శాసనసభ్యులు హఫీజ్ ఖాన్ బుధవార్ పేటలోని 14 వ వార్డులో 33 సచివాలయానికి సంబంధించిన క్లస్టర్లలో సంచరిస్తూ ప్రజల సమస్యలను తెలుసుకుని మునిపెన్నడు లేని విధంగా జగనన్న ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని కొనియాడుతూ అక్కడికక్కడే అధికారులతో మాట్లాడుతూ ప్రజలు ఇబ్బందులు పడకుండా చూసుకోవాలని రోడ్ల మరియు కాలువల శాశ్వత పరిష్కారం చేయవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు.ప్రభుత్వ పధకాల గురించి ప్రజలకు వివరిస్తూ లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి పొందిన లబ్దినీ తెలుపుతూ సంక్షేమ పథకాలు ఎన్ని రూపాలలో ప్రభుత్వం ప్రజలకు బాసటగా నిలుస్తుందో వారికి వివరించడం జరిగింది. విధుల్లో ఉన్న సమస్య అలాగే ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలు కూడ తెలుసుకొని పరిష్కరిస్తాము అని తెలియజేసి ముఖ్యంగా డ్రైనేజీ మరియు రోడ్లు ఇబ్బంది అలాగే కొన్ని చోట్ల కరెంటు తీగల వల్ల ఇబ్బంది కలుగుతుంది అని ప్రజలు తెలియజేయడం జరిగింది. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పధకాలు సకాలంలో అందుతున్నాయి అని మునుపటి ప్రభుత్వలు చేయని విధంగా ఇంటి దెగ్గరికే సంక్షేమ పధకాలు వస్తున్నాయి అని ప్రజలు సంతోషంగా తెలిపడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక 14వ వార్డు కోఆప్షన్ మెంబర్ శ్రీరాములు, పర్ల సూరీడు, మంజులత, కేదార్ నాథ్, షౌకత్ అలీ, రాముడు, కిరణ్, వెంకటేశ్వరమ్మ, అమృత్, 10 వ కార్పొరేటర్ యునుస్, ముంతాజ్, పలువురు వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు అలాగే సచివాలయం సిబ్బంది, వాలంటీర్స్, మున్సిపాలిటీ సిబ్బంది అలాగే విద్యుత్ సిబ్బంది తదితరులు పుష్పగుచ్చంతో స్వాగతం పలికి కార్యక్రమంలో పాల్గొన్నారు.