సమస్యల పరిష్కారానికే గడప గడపకు…ఆళ్ల నాని
1 min read– 8వ డివిజన్ లో ఉత్సాహంగా గడప గడపకు మన ప్రభుత్వం పాదయాత్ర..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా పటిష్ట కార్యాచరణతో ముందుకు వెళుతున్నామని మాజీ ఉపముఖ్యమంత్రి, వైఎస్ఆర్ సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆళ్ల నాని పేర్కొన్నారు. 121 రోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఆయన బుధవారం స్థానిక ఎనిమిదో డివిజన్ లో పర్యటించారు. ఈ సందర్భంగా గడపగడపకు వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను సత్వరమే పరిష్కరించాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ సందర్భంగా తమ డివిజన్ కి విచ్చేసిన ఆళ్ళ నానికి అశేష ప్రజానీకం అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని స్థానిక రామాలయంలో స్వామి వారిని సేవించుకున్నారు. కార్యక్రమంలో నగర మేయర్ షేక్ నూర్జహాన్, కార్పొరేటర్ వంకదారు ప్రవీణ్ కుమార్, ఏఎంసీ చైర్మన్ నెరుసు చిరంజీవులు, డిప్యూటీ మేయర్ లు ఎన్ సుధీర్ బాబు, గుడిదేసి శ్రీనివాస రావు, వైసీపీ నగర అధ్యక్షుడు బొద్దాని శ్రీనివాస్, జిల్లా కోశాధికారి మంచెం మైబాబు, నగర్ కమిషనర్ వెంకటకృష్ణ, పలువురు కార్పోరేటర్లు, అనుబంధ విభాగాల అద్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.