ప్రజా సమస్యల పరిష్కారానికి దిక్సూచి ” పల్లెవెలుగు”.
1 min readపల్లెవెలుగు తెలుగు దినపత్రిక క్యాలెండర్ ఆవిష్కరించిన మాండ్ర.
పల్లెవెలుగు దినపత్రిక దినదినాభివృద్ధి చెందాలి..టిడిపి నాయకులు.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: ప్రజా సమస్యల పరిష్కారానికి దిక్సూచిలా పల్లెవెలుగు దిన పత్రిక నిలుస్తుందని టీడీపీ నంద్యాల పార్లమెంట్ ఇంచార్జి మాండ్ర శివానంద రెడ్డి అన్నారు.నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో ఆయన స్వగృహంలో మంగళవారం పల్లెవెలుగు తెలుగు దినపత్రిక 2024 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆయన ఆవిష్కరించారు. ఈ క్యాలెండర్ ఆవిష్కరణలో తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గిత్త జయసూర్య,తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి,ఐటీడీపీ అధ్యక్షులు ముర్తుజావలి,పట్టణ టిడిపి నాయకులు ఎస్ఎండి జమీల్,రసూల్ ఖాన్,పగిడ్యాల టిడిపి మండల కన్వీనర్ పలుచాని మహేశ్వర రెడ్డి, తెలుగు యువత జిల్లా ఉపాధ్యక్షుడు మద్దిలేటి,ఎస్సీ సెల్ నాయకులు నిమ్మకాయల మోహన్,పట్టణ ప్రధాన కార్యదర్శి బొల్లెద్దుల రాజన్న,ఐ-టీడీపీ పట్టణ అధ్యక్షుడు ప్రభు కుమార్, పగడం సోమ శేఖర్,అబ్దుల్ వహీద్,రైతు సంఘం నాయకులు బెస్తరాజు, బిసి సంఘం నాయకులు రంగస్వామి, ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మాండ్ర శివానంద రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజలను చైతన్య పరుస్తున్న పల్లెవెలుగు పత్రిక ప్రజల మన్ననలు పొందుతుందని కొనియాడారు.వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను వెలికి తీయడంలో పల్లెవెలుగు దిన పత్రికది ఒక ప్రత్యేకత అన్నారు.కార్యక్రమంలో టీడీపీ నాయకులు.బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు సాయి కొండ మద్దిలేటి, టీడీపీ నాయకులు వంగల బ్రహ్మానంద రెడ్డి, ఘణపురం చంద్రేస్ ,రవి, తదితరులు పాల్గొన్నారు.