టిడిపి పార్టీ కార్యాలయంలో ఘణంగా సోమిశెట్టి జన్మదిన వేడుకలు
1 min read
హాజరైన టిడిపి అధ్యక్షులు పి. తిక్కారెడ్డి మంత్రి టి.జి. భరత్
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కా రెడ్డి ఆధ్వర్యంలొ తెలుగుదేశంపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు జన్మదిన వేడుకలు జిల్లా తెలుగుదేశంపార్టీ కార్యాలయం, కర్నూలు నందు ఘనంగా నిర్వహించడం జరిగింది.కార్యక్రమానికి రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రివార్యులు టి.జి.భరత్ ముఖ్య అతిధిగా హాజరు కావడమైనది. ఈ సంధర్బంగా సోమిశెట్టి వెంకటేశ్వర్లు కేక్ ను కట్ చేసి కార్యక్రమానికి విచ్చేసిన వారికి అందజేయడమైనది.కార్యక్రమానికి తెలుగుదేశంపార్టీ నాయకులు శ్రీయుతులు నాగరాజు యాదవ్, నంద్యాల నాగేంద్ర, ధరూర్ జేంస్ అబ్బాస్, స్వామి రెడ్డి పరమేష్, సోమిశెట్టి నవీన్, సత్రం రామక్రిష్ణుడు, పి.హనుమంతరావు చౌదరి, పేరపోగు రాజు, నంది మధు, మహెష్ గౌడ్, బొగ్గుల బజారన్న, మల్లెల పుల్లా రెడ్డి, బేతం క్రిష్ణుడు, పుల్లయ్య, అఖిల్, ఉమర్ బాష, ప్రవీన్, ప్రకాష్, లక్ష్మి దేవి మొదలగు వారితో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు.