ఇస్రో చైర్మన్ గా సోమనాథ్
1 min read
పల్లెవెలుగువెబ్ : ఇస్రో చైర్మన్ గా సోమనాథ్ నియామకమయ్యారు. విక్రంసారాభాయ్ అంతరిక్ష కేంద్రం డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న సోమనాథ్ జీఎస్‌ఎల్‌వీ ఎంకే-III లాంచర్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాడు. కొల్లాంలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. ప్రస్తుతం ఇస్రో చైర్మన్‌గా వ్యవహరిస్తున్న కె. శివన్ పదవీ కాలం పూర్తయిన తర్వాత ప్రపంచంలోని ప్రముఖ అంతరిక్ష సంస్థల్లో ఒకటైన ఇస్రోకి సోమనాథ్ అధిపతిగా వ్యవహరించనున్నారు. జనవరి 12, 2022న కె. శివన్ పదవీ కాలం పూర్తవుతుంది.