PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కొడుకు ఐడియా.. తండ్రిని స‌క్సెస్ చేసింది..!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్​: డాడీ ఆరుముగం. చ‌దివింది 6వ‌ త‌ర‌గ‌తి. చిన్నప్పుడే చ‌దువు మానేసి.. యాల‌కుల తోట‌లో కూలీగా వెళ్లాడు. కాఫీ తోట‌ల్లో, తేయాక తోట‌ల్లో దిన‌కూలీగా ప‌నిచేశారు. ఢిల్లీ , ముంబై, క‌ల‌క‌త్తాల్లో చిన్న చిన్న ఉద్యోగాలు చేశారు. కానీ సంపాద‌న లేదు. సంతృప్తిలేదు. ఆరుగాలం క‌ష్టప‌డ్డా వ‌చ్చేది చాలా త‌క్కువ‌. ఊరూర తిరుగుతూ జీతం కోసం వెట్టిచాకిరీ చేయ‌డం కంటే.. సొంతంగా హోట‌ల్ పెట్టుకుందామ‌ని ఆలోచ‌న వ‌చ్చింది. దీంతో త‌న ఆలోచ‌న‌కు అంకురార్పణ చేశారు.


డాడీ ఆరుముగం చిన్నప్పుడు చ‌దువు వ‌దిలేసాక‌.. సుప్పమ్మ అనే మ‌హిళ ద‌గ్గర వంట నేర్చుకున్నాడు. దాదాపు 12 ఏళ్ల పాటు వంట చేయ‌డంలో ప్రావీణ్యం సంపాదించాడు. చిన్న చిన్న జీతానికి ప‌నిచేయ‌లేక‌.. త‌న చేతివృత్తి అయిన వంట ప‌నితోనే వ్యాపారం ప్రారంభిద్దామ‌ని ఆలోచ‌న చేశాడు. అందులో భాగంగా త‌మిళ‌నాడులోని త‌న సొంత ఊరు ‘పొడి’ లో ‘మామియ‌’ అనే భోజ‌న‌శాల ఏర్పాటు చేశాడు. అయినా.. ఆయ‌న అనుకున్నంత సులువుగా విజయం రాలేదు. హోట‌ల్ బిజినెస్ జ‌ర‌గ‌లేదు. దీంతో ఆయ‌న హోట‌ల్ బిజినెస్ స‌క్సెస్ కాలేదు.
ఐడియా.. అదుర్స్​
కూటి కోసం కోటి విద్యలు అన్నట్టు డాడీ ఆరుముగం.. అనేక ప‌నులు చేశారు. అందులో పెయింట్ వేయ‌డం కూడ ఒక‌టి. పెయింటింగ్ కాంట్రాక్ట్ తీసుకుని… దాని ద్వార వ‌చ్చే ఆదాయంతో కుటుంబాన్ని పోషించే వాడు. అయితే… ఉన్నట్టుంది డాడీ ఆరుముగం కొడుకు గోపీనాథ్ కు ఒక ఐడియా వ‌చ్చింది. త‌న తండ్రికి వంట చేయ‌డం బాగా వ‌చ్చు.. కాబ‌ట్టి ఆయ‌న వంట చేసే వీడియోలు తీసి.. ఆ వీడియోలు యూట్యూబ్ లో పెడితే ఎలా ఉంటుంద‌న్న ఆలోచ‌నకు ఆచ‌ర‌ణ రూపం ఇచ్చాడు.


మెద‌టి నెల‌లో కేవ‌లం 4, 5 వీడియోలు చేశారు. 7 వేల రూపాయ‌లు యూట్యూబ్ నుంచి వ‌చ్చింది. ఇంత చిన్న డ‌బ్బుకా.. అన్ని వ‌దిలేసి యూట్యూబ్ వీడియోలు చేసింది అన్న ఆలోచ‌న డాడీ ఆరుముగంకి వ‌చ్చింది. అయితే.. రెండో నెల 40 వేలు వ‌చ్చింది. మూడో నెల ల‌క్ష రూపాయాలు ఆదాయం వ‌చ్చింది. దీంతో ఇక డాడీ ఆరుముగం వెనుతిరిగి చూసుకోలేదు. త‌న వంట నైపుణ్యాన్ని యూట్యూబ్ వీడియోల‌ ద్వార ప్రపంచానికి తెలియ‌జేశాడు. మాంసాహారం, శాఖాహారం ఇలా రెండు ర‌కాలుగా వంట‌లు చేయ‌డంలో డాడీ ఆరుముగం దిట్ట. యూట్యూబ్ ప్రపంచం డాడీ ఆరుముగం వంట‌ల‌కు స‌లాం కొట్టింది. Village food factory పేరుతో వీడియోలు వైరల్ అయ్యాయి. దీంతో ఆయ‌నకు మంచి పేరు వ‌చ్చింది. యూట్యూబ్ ద్వార వ‌చ్చిన డ‌బ్బుతో ఆయ‌న ఓ పెద్ద ఇల్లు కూడ క‌ట్టేశారు. అయితే.. ఈ విజయం ఆయ‌న‌కు ఒక్కసారిగా వ‌చ్చింది కాదు. ఎన్నో ఏళ్లు శ్రమించి.. త‌న నైపుణ్యాన్ని ఒక చ‌క్కని వేదిక మీద ప్రద‌ర్శిస్తే కానీ ఆయ‌న‌కు విజ‌యం రాలేదు. ఎంతో మంది యువ‌త‌కు ‘డాడీ ఆరుముగం’ ఆద‌ర్శం అని చెప్పవ‌చ్చు.

About Author