కొడుకు కేంద్ర మంత్రి.. తల్లిదండ్రులు కూలి పనికి !
1 min readపల్లెవెలుగు వెబ్ : కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ తల్లిదండ్రులు రోజూ కూలి పనికి వెళ్తున్నారు. కొడుకు కేంద్ర మంత్రి అయినా..కూలి పనికి వెళ్లడం పట్ల పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ ది తమిళనాడులోని నామక్కల్ జిల్లా పరపత్తి సమీపంలోని కోనూరు గ్రామం. ఆయన తండ్రి లోకనాథం, తల్లి వరదమ్మాల్ మొదటి నుంచి వ్యవసాయ కూలీలు. కష్టపడి కొడుకుల్ని చదివించారు. ఎల్. మురుగన్ న్యాయవిద్య, ఎమ్ఎల్, పీహెచ్డీ పూర్తీ చేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో పనిచేశారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి అయ్యారు. ఆయన భార్య కలైయరసి చెన్నైలోని చిన్నపిల్లల వైద్యురాలిగా పనిచేస్తుంది. దీని పై మురుగన్ తల్లిదండ్రులు స్పందించారు. తమ కుమారుడు వారి వద్దకు రమ్మని పిలిచాడని, చిన్నప్పటి నుంచి సొంత కష్టంతో బతకాలని నిర్ణయించుకుని కూలి పనులకు వెళ్తున్నామని మురుగన్ తల్లిదండ్రులు తెలిపారు.