రాజీనామా యోచనలో సోనియా, రాహుల్, ప్రియాంక !
1 min read
New Delhi, Aug 11 (ANI): AICC general secretary Priyanka Gandhi Vadra, Congress leader Rahul Gandhi and UPA Chairperson Sonia Gandhi during the condolence program for former Delhi Chief Minister Late Sheila Dikshit in New Delhi on Saturday. (ANI Photo)
పల్లెవెలుగువెబ్ : కాంగ్రెస్ జీ23 నేతల భేటీ నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక గాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురూ కాంగ్రెస్‌లోని తమ పదవులకు రాజీనామాలు ప్రకటించనున్నట్లు సమాచారం. అయిదు రాష్ట్రాల ఎన్నికల్లో ఘోర ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామాలు చేయనున్నట్లు సమాచారం. సీడబ్ల్యూసీ భేటీలో రాజీనామాల విషయాన్ని వారు వెల్లడించే అవకాశం ఉంది. కాగా 5 రాష్ట్రాల ఎన్నికల పరాజయాలపై చర్చించేందుకు ఆదివారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కాబోతోంది. ఈ భేటీకి సోనియా గాంధీ అధ్యక్షత వహించనున్నారు. ఇప్పటికే ఒక్కో రాష్ట్రంలో అధికారం కోల్పోతూ వస్తున్న కాంగ్రెస్ పార్టీ తాజాగా పంజాబ్‌లోనూ అధికారం పొగొట్టుకుంది. ఈ నేపథ్యంలో ఇక మిగిలిన రెండు రాష్ట్రాలు రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌లో అధికారం నిలబెట్టుకోవడంతో పాటు భవిష్యత్ వ్యూహంపై చర్చించేందుకు సీడబ్ల్యూసీ నేతలు భేటీ కానున్నారు.