PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆచార్యలో సోనూ లుక్‌

1 min read

సినిమా డెస్క్​ : మెగాస్టార్ చిరంజీవి- మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న తాజా చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ సమర్పణలో మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. ధర్మస్థలి అనే ఊరి నేపథ్యంలో సందేశాత్మక అంశాలతో రూపొందిస్తుస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి – చరణ్ నక్సలైట్లుగా కనిపిస్తున్నారు. కాజల్ అగర్వాల్, పూజాహెగ్డే హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ యాక్టర్ సోనూసూద్ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. సోనూసూద్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ.. ఆయన ఫస్ట్ లుక్‌ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఇందులో నుదుట బొట్టు పెట్టుకుని మెడలో రుద్రాక్ష మాల ధరించిన సోనూ.. పిలకతో డిఫరెంట్ లుక్ లో కనిపించారు. తెలుగు విలన్ పాత్రలతో పాపులర్ అయిన సోనూసూద్.. ‘ఆచార్య’ లో కూడా నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్‌లో నటిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన సోనూసూద్ ఆచార్య లుక్ విశేషంగా ఆకట్టుకుంటోంది. చిరంజీవి ట్వీట్ చేస్తూ.. ‘ప్రియమైన సోనూసూద్.. మీరు నిజమైన జీవితాన్ని గడుపుతున్నారు. కష్టాల్లో ఉన్న పేదవారికి సహాయం చేయడం కంటే గొప్ప సంతృప్తి మరొకటి ఉండదు. మీ జీవితం ఎల్లప్పుడూ దయ మరియు సంతృప్తితో నిండి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్ డే సోనూసూద్. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే’ అని పేర్కొన్నారు.

About Author