NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సోనూ స‌ర్.. ఓ కోటి రూపాయ‌లు ఇవ్వండి…!

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : క‌రోన లాక్ డౌన్ స‌మ‌యంలో ఎంద‌రో అభాగ్యుల‌కు ఆపన్నహ‌స్తం అందించారు న‌టుడు సోనూసూద్. దిక్కుతోచ‌క న‌గ‌ర కీకారణ్యంలో చిక్కుకున్న కూలీల‌ను, సామాన్యుల‌ను స్వస్థలాల‌కు చేర్చారు. దీంతో సాయం కోసం సోనూసూద్ ను ఆశ్రయించే వారి సంఖ్య పెరిగింది. ట్విట్టర్ లో వేల కొద్ది అభ్యర్థన‌లు సోనూసూద్ వ‌చ్చాయి. ఇటీవ‌ల ఓ ఆక‌తాయి సోనూసూద్ కు ట్విట్టర్ వేదిక‌గా ఓ అభ్యర్థన చేశారు. సోను స‌ర్ .. ఓ కోటి రూపాయ‌లు ఉంటే ఇవ్వొచ్చుగా అంటూ ట్వీట్ చేశాడు. దీనికి ఏమాత్రం కోప్పడ‌కుండా త‌నదైన శైలిలో గ‌ట్టి పంచ్ ఇచ్చాడు. ‘ ఏం మ‌హేంద్ర…. కోటి రూపాయ‌లు ఏం స‌రిపోతాయి. ఇంకా ఎక్కువ అడ‌గ‌లేక‌పోయావా ’ అంటూ రిప్లై ఇచ్చారు. దీంతో స‌ద‌రు ఆక‌తాయి ట్విట్టర్ లో తోక‌ముడిచి.. త‌న ట్వీట్ ను డిలీట్ చేశాడు. గ‌తంలో ఇలాంటి అభ్యర్థన‌లు అనేకం వ‌చ్చాయి. వాట‌న్నింటిని సోనూసూద్ చాలా లైట్ గా తీసుకున్నారు.

About Author