NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

చంద్రబాబును మెచ్చుకున్న సోనూసూద్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: తాను సినిమా షూటింగ్ ల కోసం అనేక‌సార్లు హైద‌రాబాద్ కు వ‌చ్చాన‌ని, అక్కడి మౌలిక‌స‌దుపాయాలు, న‌గ‌రం అందం త‌న‌ను బాగా ఆక‌ట్టుకున్నాయ‌ని సోనూసూద్ తెలిపారు. చంద్రబాబు దూర‌దృష్టితో హైద‌రాబాద్ న‌గ‌రంలో అన్ని ర‌కాలుగా అభివృద్ధి చెందింద‌ని న‌టుడు సోనూసూద్ చెప్పారు. త‌న స‌హ‌చ‌ర న‌టుల‌కు చంద్రబాబు విజ‌న్ గురించి చెబుతుంటానని తెలిపారు. కులం, మతంతో సంబంధం లేకుండా దేశ ప్రజ‌ల‌కు సేవ‌చేసే అవ‌కాశం ద‌క్కింద‌ని చెప్పారు. ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరూ త‌న‌కు స‌హ‌క‌రించాల‌ని కోరారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేసిన వెబినార్ లో చంద్రాబు తోపాటు, సోనూ సూద్ పాల్గొన్నారు. ఈ వెబినార్ లో సోనూ సూద్ ఈ వ్యాఖ్యలు చేశారు.

About Author