NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సోనూసూద్ రాజ‌కీయాల్లోకి వ‌స్తార‌ని భ‌య‌ప‌డ్డారు..!

1 min read

పల్లెవెలుగు వెబ్​:కోవిడ్ స‌మ‌యంలో నిస్వార్థ సేవ చేసిన సోనూసూద్ ప్రపంచ దృష్టిని ఆక‌ర్షించార‌ని కేటీఆర్ అన్నారు. ఏదైనా మంచి ప‌నిచేసిన‌ప్పుడు పేరు కోసం చేస్తున్నార‌ని, దీని వెనుక ఇంకేదో ఉంద‌ని త‌ప్పుడు ప్రచారం చేస్తార‌ని అన్నారు. చివ‌రికి కించ‌ప‌రిచే ప్రయ‌త్నం చేస్తార‌ని చెప్పారు. సోనూసూద్ విష‌యంలో ఇదే జ‌రిగింద‌ని తెలిపారు. ఆయ‌న రాజ‌కీయాల్లోకి ఎక్కడ వ‌స్తారో అని.. ఈడీ, ఐటీతో దాడులు చేయించార‌ని కేటీఆర్ అన్నారు. సోనూసూద్ నిజ‌మైన హీరో అని, ఆయ‌న వెంట మేమంతా ఉన్నామ‌ని తెలిపారు. హైద‌రాబాద్ లోని మాదాపూర్ హెచ్ఐసీసీలో కోవిడ్ వారియ‌ర్స్ కు స‌న్మానం జ‌రిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి కేటీఆర్, ప్రముఖ నటుడు సోనూసూద్ పాల్గొన్నారు.

About Author