NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సోనూసూద్.. ఎంపీగా రెండు పార్టీల నుంచి ఆఫ‌ర్ !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : ప్రముఖ న‌టుడు సోనూసూద్ కు రాజ్యస‌భ సీటు ఇచ్చేందుకు రెండు పార్టీలు ముందుకు వ‌చ్చాయి. ఈ విష‌యాన్ని న‌టుడు సోనూసూద్ వెల్లడించారు. రాజ‌కీయాల్లోకి చేరేందుకు మాన‌సికంగా సిద్ధంగా లేనందున ఆ ఆఫ‌ర్ తిర‌స్కరించిన‌ట్టు ఆయ‌న తెలిపారు. రాజ‌కీయాల్లోకి చేరేందుకు సిద్ధమైన‌ట్టు తానే ఆ విష‌యాన్ని వెల్లడిస్తాన‌ని చెప్పారు. త‌న‌పై జ‌రిగిన ఐటీ దాడుల విష‌యాన్ని కూడ సోనూసూద్ ప్రస్తవించారు. ప్రతి విష‌యానికి సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. కాల‌మే అన్నింటికి స‌మాధానం చెబుతుంద‌న్నారు. త‌న సంస్థలోని ప్రతి రూపాయి సాయం చేయ‌డానికి ఎదురుచూస్తుంద‌ని అన్నారు. త‌నకు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా వ‌చ్చే ప్రతిరూపాయి మాన‌వ సేవ‌కు ఉప‌యోగించాల‌ని ఆయా సంస్థల‌కు చెప్పిన‌ట్టు సోనూసూద్ వెల్లడించారు.

About Author