సోనూసూద్ ఆక్సిజన్ ప్లాంట్.. ఆత్మకూరుకు..
1 min read– కృతజ్ఞతలు తెలిపిన వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు అంజాద్ ఆలీ
పల్లెవెలుగువెబ్, ఆత్మకూరు: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోన కష్టకాలంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న కీలక నిర్ణయాల వల్ల ఆంధ్రప్రదేశ్‌లో పాజిటివ్ కేసులు త్వరగా తగ్గాయని అన్నారు. వైఎస్సార్సీపీ ఆత్మకూరు పట్టణ అధ్యక్షుడు అంజాద్ ఆలీ. కోవిడ్ కారణంగా ఆక్సిజన్ అందక ఎందరో ఇబ్బందులకు గురయ్యారని, అలాంటి వారి కష్టాలను తొలగించేందుకు సినీనటుడు సోనూసూద్ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు.
దేశంలోని అన్ని రాష్ట్రాలకు సోనూసూద్ ఆక్సిజన్ ప్లాంట్లు, కన్సంటేటర్లు ఇతర పరికరాలు సరఫరా చేయడం ప్రశంసనీయమన్నారు. శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణి రెడ్డి చొరవతో ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రిలో సోనూసూద్ ప్లాంట్ త్వరలో ఏర్పాటు చేయనున్నారని పేర్కొన్నారు. ఆత్మకూరు అటవీ ప్రాంతంలో గిరిజనులు, చెంచులు ఎందరో కోవిడ్ బారిన పడ్డారని, వారిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేశారని, సోనూసూద్ సహకారంతో మరొకటి ఏర్పాటు కావడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఆత్మకూరు ప్రజల తరుపున సోనూసూద్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నామని వైసీపీ పట్టణ అధ్యక్షుడు అంజాద్ ఆలీ వెల్లడించారు.