PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సోనూసూద్​ సేవలు.. అభినందనీయం

1 min read

– పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్​ రెడ్డి
పల్లెవెలుగు వెబ్​, కల్లూరు: సినీ నటుడు సోనూసూద్​ సేవలు అభినందనీయమని ప్రశంసించారు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్​ రెడ్డి. ఆక్సిజన్​ అందక కోవిడ్​ పేషెంట్లు ప్రాణాలు వదులుతున్న క్రమంలో.. సోనూసూద్​ కర్నూలులో ఆక్సిజన్​ ప్లాంట్​ ఏర్పాటు చేస్తానని ప్రకటించడం హర్షించదగ్గ విషయమన్నారు. సోనూసూద్​ నిర్ణయానికి సంపూర్ణ మద్దతు, సహకారం అందజేస్తామన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్​ రెడ్డిని సోనూసూద్​ పీఆర్​ఓ శ్రీధర్​ శ్రీ మర్యాదపూర్వకంగా కలిశారు. మరో రెండు వారాల్లో ఆక్సిజన్​ ప్లాంట్​ను కర్నూలులో స్థాపించనున్నట్లు సోనూసూద్​ పీఆర్​ ఓ శ్రీధర్​ శ్రీ ఎమ్మెల్యేకు తెలిపారు. అక్షిజన్ అందక చాలామంది ప్రాణాలు కోల్పోతున్న నేపథ్యంలో సోనూసూద్ ఈ నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో స్వరూన్ రాజ్, శ్రీకాంత్ ఉన్నారు.

About Author