PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సోనూసూద్ మొదటి ఆక్సిజన్ ప్లాంట్ కర్నూలులో ..!

1 min read
కర్నూలు ప్రభుత్వ కంటి ఆస్పత్రి ఆవరణలో ప్లాంట్​ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలిస్తున్న అధికారులు

కర్నూలు ప్రభుత్వ కంటి ఆస్పత్రి ఆవరణలో ప్లాంట్​ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలిస్తున్న అధికారులు

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు : కోవిడ్​–19 బారిన పడి.. ఆక్సిజన్​ అందక ఎందరో మృత్యువాత పడుతున్న క్రమంలో సినీ నటుడు సోనుసూద్​ తీసుకున్న నిర్ణయం దేశానికే ఊపిరినిచ్చింది. ఆక్సిజన్​ ప్లాంట్​ ఏర్పాటుతో ప్రజల ప్రాణాలు కాపాడవచ్చన్న సదుద్దేశంతో సోనూసూద్​ ఇప్పటికే యూఎస్​ మరియు ఫ్రాన్స్​ దేశాలతో ప్లాంట్ల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ ప్లాంట్లను వివిధ రాష్ట్రాల్లోని అవసరమైన ఆసుపత్రులలో ఏర్పాటు చేస్తారు.
కర్నూలులో.. ప్రథమం :
సోనూసూద్​ ఆక్సిజన్​ ప్లాంట్లను ఒకేసారి ఆంధ్రప్రదేశ్​లోని కర్నూలు, నెల్లూరులో ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్​ ప్లాంట్​ ఏర్పాటు చేసే పనిలో సోనూసూద్​ బృందం నిమగ్నమైంది. ఆ తరువాత నెల్లూరులో ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే మున్సిపల్ కమిషనర్, కలెక్టర్ మరియు ఇతర సంబంధిత అధికారుల నుండి అవసరమైన అనుమతులను కూడా పొందారు.
మానవత్వానికి కృతజ్ఞతలు : కర్నూలు ఇన్​చార్జ్​ కలెక్టర్​ రాం సుందర్ రెడ్డి
సోనూసూద్ మానవత్వ ఆలోచనలకు కృతజ్ఞతలు తెలిపాలి. ఆయన ఏర్పాటు చేస్తున్న ఆక్సిజన్ ప్లాంట్ ప్రతిరోజూ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో 150 నుండి 200 మంది కోవిడ్ రోగులకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. ” అన్నారు. ఈ ప్లాంట్ల ఏర్పాటుతో కర్నూలు, నెల్లూరు మరియు పొరుగు గ్రామాలలో ఉన్న వేలాది మంది కోవిడ్ బాధితులకు ఆక్సిజన్ అందించనుంది.

పోరాటానికి.. ధైర్యనిస్తాం: సోనూసూద్​
‘‘ గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడానికి ఆక్సిజన్​ ప్లాంట్​ చాలా అవసరం. ఈ ప్లాంట్స్ కోవిడ్ -19 తో ధైర్యంగా పోరాడటానికి అవసరమైన వారికి సహాయపడతాయని నేను భావిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ తరువాత, జూన్ & జూలై మధ్య మరికొన్ని రాష్ట్రాల్లో మరికొన్ని ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నాం. ప్రస్తుతం, మేము వివిధ రాష్ట్రాల నిరుపేద ఆసుపత్రులను గుర్తించాము. ” అని తెలియజేశారు.

About Author