NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

త్వరలో జగన్​..జైలుకు…!

1 min read

– రానున్నది టీడీపీ ప్రభుత్వమే…

– దోచుకున్నది ప్రజలకు పంచేస్తాం…

– మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర రెడ్డి

కర్నూలు: మరి కొద్ది రోజుల్లో జగన్ జైలు కు పోవడం ఖాయమని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కల్లూరు అర్బన్ పరిధిలోని యన్ టి ఆర్ బిల్డింగ్ లో నంద్యాల పార్లమెంట్ టీడీపీ మహిళా అధ్యక్షురాలు పార్వతమ్మ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన పరిచయ కార్యక్రమంలో బైరెడ్డి రాజశేఖరరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ విధ్వంసకరమైన పాలనను సాగిస్తూ రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేశారన్నారు. ప్రతిదీ దోచుకోవడం దాచుకోవడం తప్ప అభివృద్ది శూన్యం అన్నారు. రానున్నది తెలుగుదేశం ప్రభుత్వం అన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వగానే నేతలు దోచుకున్నది, దాచుకున్నది అంత ప్రజలకు పంచెలా చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం, ఇసుక, భూ మాఫియా వంటి దందాలతో జగన్ సర్కార్ ప్రజలను ఇబ్బంది పెట్టారన్నారు. రానున్న ఎన్నికల్లో నంద్యాల పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డా.బైరెడ్డి శబరి నీ గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మందుల శివ, జనార్దన్ ఆచారి, నాగేశ్వర రావు, మల్లెల పుల్లారెడ్డి పాల్గొన్నారు.

About Author