NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సీబీఐ గురించి ఇలా చెప్పడానికి చింతిస్తున్నా : జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : దేశంలో న్యాయాధికారుల పై దాడులు, దూష‌ణ‌లు ఎక్కువ‌వుతున్నాయ‌ని సుప్రీం కోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ ఆవేద‌న వ్యక్తం చేశారు. ఈ విష‌యంలో సీబీఐ, ఐబీ న్యాయ‌వ్యవ‌స్థకు స‌హ‌క‌రించ‌డం లేద‌ని ఆయ‌న అన్నారు. న్యాయ‌స్థానం విచార‌ణ‌కు ఆదేశించినా.. ఏడాది దాటినా సీబీఐ ఏమీ చేయ‌డం లేద‌ని వాపోయారు. సీబీఐ వైఖ‌రిలో మార్పు వ‌స్తుంద‌ని ఆశించామ‌ని, కానీ ఎలాంటి మార్పు రాలేద‌ని ఆయన వ్యాఖ్యానించారు. సీబీఐ గురించి ఇలా చెప్పడానికి చింతిస్తున్నా కానీ… ఇది వాస్తవం అని జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ అన్నారు. త‌మ‌కు వ‌స్తున్న బెదిరింపుల గురించి న్యాయ‌మూర్తులే ఫిర్యాదు చేసినా ప‌ట్టించుకోవ‌డం లేదంటూ ఆవేద‌న వ్యక్తం చేశారు.

About Author