NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘మా’ కు పోటీగా ‘ఆత్మా’.. ఇండ‌స్ర్టీలో ముస‌లం ?

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ముక్కలు కానుందా ?. ‘మా’కు పోటీగా మ‌రో అసోసియేష‌న్ రానుందా ?. ఈ ప్రశ్నల‌కు త్వర‌లో ప్రకాశ్ రాజ్ ప్యానెల్ పెట్టబోయే ప్రెస్ మీట్ లో స‌మాధానం దొర‌క‌నుంది. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచిన స‌భ్యులు మాని వీడుతార‌ని ప్రచారం జ‌రుగుతోంది. ‘మా’కు పోటీగా మ‌రో అసోసియేష‌న్ ఏర్పాటు చేస్తార‌ని స‌మాచారం. ఆల్ తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ (ఆత్మా) పేరుతో కొత్త అసోసియేష‌న్ ప్రారంభింస్తార‌ని స‌మాచారం. ‘మా’ఎన్నిక‌ల్లో మంచు విష్ణు ప్యానెల్ ప్రాంతీయ వాదాన్ని తెర‌పైకి తెచ్చింది. ఈ నేప‌థ్యంలో ప్రాంతీయ వాదం ఉన్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ లో కొన‌సాగ‌లేమంటూ మెగా బ్రద‌ర్ నాగ‌బాబు, ప్రకాశ్ రాజ్ మాకు రాజీనామా చేశారు.

About Author