NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దక్షిణాఫ్రికా ఊడ్చేసింది !

1 min read

పల్లెవెలుగువెబ్ : దక్షిణాఫ్రికాలో జరిగిన మూడో వన్డేలో టీమిండియా పోరాడి ఓడింది. 288 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 49.2 ఓవర్లలో 283 పరుగుల వద్ద ఆలౌట్‌ కావడంతో దక్షిణాఫ్రికా 4 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను దక్షిణాఫ్రికా 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. దీపక్‌ చహర్‌ 54 పరుగులతో ఆఖర్లో ఆశలు రేపినప్పటికి చివరి నిమిషంలో ఔటవడంతో టీమిండియా ఓటమి ఖరారు అయింది. అంతకముందు శిఖర్‌ ధావన్‌ 61, కోహ్లి 65 రాణించారు. సౌతాఫ్రికా బౌలర్లలో ఫెక్యలువాయో 3, లుంగీ ఎన్గిడి 3, డ్వేన్‌ ప్రిటోరియస్‌ 2 వికెట్లు తీశారు.

           

About Author