డ్రం సిడర్తో వరి విత్తడం వల్ల ఎన్నో లాభాలు
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: డ్రం సీడర్ తో వరి విత్తడం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయని మహానంది మండల వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వరరావు రెడ్డి శనివారం పేర్కొన్నారు. మండలంలోని బొల్లవరం గ్రామంలో పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడుతూ డ్రం సీడర్ విధానం వల్ల కూలీల ఖర్చు తగ్గడమే కాక విత్తనాల ఖర్చు కూడా తక్కువగా ఉంటుందన్నారు. వరిలో పిలకలు అధికంగా వస్తాయని చీడపీడల తట్టుకునే శక్తి కూడా ఉంటుందన్నారు. క్రిమి రసాయనిక మందులు కూడా తక్కువగా వాడాల్సి ఉంటుందన్నారు. ఎకరాకు సాగు ఖర్చు 5 నుండి పదివేల వరకు తగ్గుతుంది అన్నారు. ప్రతి రైతు ఆధునిక వ్యవసాయ పద్ధతులు పాటించాలని సూచించారు. రసాయనిక క్రిమిసంహారక మందులు వాడకం తగ్గించి జీవన ఎరువులు ఉపయోగిస్తే భూమి సారవంతం అవ్వడమే కాకుండా వాతావరణ కాలుష్యం కూడా తగ్గుతుందన్నారు. ప్రతి రైతు తప్పనిసరిగా సమీపంలోని ఆర్ బి కే కేంద్రంలో ఈ కేవై చేయించుకోవాలన్నారు. ఈ క్రాప్ బుకింగ్ తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. అప్పుడే ఏవైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్నప్పుడు గ్రామాన్ని యూనిట్గా చేసుకుని పొందే అవకాశం ఉంటుంది అన్నారు. ధాన్యం విక్కయించుకోవడానికి లేదా ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న సమయంలో తమ పంట ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసే అవకాశం ఉందన్నారు.. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు చంద్రశేఖర్ విఆర్ఓ చలమయ్య గ్రామ రైతులు పాల్గొన్నారు.