అధిక వర్షాలతో దెబ్బతిన్న సోయా పంట
1 min read–క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టం అంచనా వేస్తున్నాం
–మండల వ్యవసాయ అధికారి హేమ సుందర్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ ,గడివేముల: రైతులకు ఈ వర్షాకాలంలో వేసిన సోయా పంట కష్టాలను మిగులుస్తుంది ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో పొలాల్లో నీళ్లు నిలబడడంతో చేతికొచ్చే పంట దిగుబడి తగ్గినట్టు రైతులు వాపోయారు మండల వ్యాప్తంగా దాదాపు 4500 ఎకరాల పైచిలుకు రైతులు సోయా పంట సాగు చేశారు ముందస్తుగా చిందుకూరు బూజనూరు గ్రామాలలో సోయపంట వేశారు ఒక్క బుజనూరు గ్రామంలోనే 800 ఎకరాలు దాదాపు 200 హెక్టార్లు పంట సాగు చేశారు దాదాపు 250 ఎకరాలు పంట కటింగ్ అయినా మిగతా 500 ఎకరాల్లో వర్షం వల్ల పంట దెబ్బతింది కరిమద్దెల పెసరవెయ్ గ్రామాల్లో కొంచెం లేటుగా వేయడంతో ఆ గ్రామ రైతుల పంటపై కొద్ది మేర ప్రభావం చూపినట్టు సమాచారం
కౌలుకు తీసుకొని వేసిన పంట నష్టపోయాను:
రైతు పంట భువనేశ్వర్ రెడ్డి..మాది బూజునూరు గ్రామం దాదాపు 8 ఎకరాలు కౌలుకు తీసుకొని సోయా పంట జూన్లో వేసినట్టు ఈనెల 6 7 8 తేదీలలో కురిసిన అధిక వర్షాల వల్ల ఐదు ఎకరాలు దాదాపు పంట చేతికి రాలేదని వ్యవసాయ అధికారులు నష్టపరిహారం అంచనా వేసి న్యాయం చేయాలని రైతు కోరారు.సోయాపంట నష్టపరిహారం అంచనా వేస్తున్నాం.. వ్యవసాయ శాఖ అధికారి హేమ సుందర్ రెడ్డి..ముందస్తుగా జూన్లో వేసిన సోయపంట ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు నష్టపోయామని రైతుల ఫిర్యాదుతో క్షేత్ర స్థాయిలో పర్యటించి నష్టం అంచనా నమోదు చేస్తున్నట్టు నివేదికను ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు రైతులు పంటల భీమా నమోదు చేసుకోవడానికి ఆఖరి తేదీ 14వ తేదీ వరకు ఉందని స్థానిక రైతు భరోసా సెంటర్లలో వ్యవసాయ శాఖ అధికారులకు సంప్రదించాలన్నారు ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.