అత్యవసరమైతేనే బయటకు రావాలి
1 min read
కర్ఫ్యూను పరిశీలించిన ఎస్పీ ఎస్పీ అన్బురాజన్
– ప్రజలకు సూచించిన కడప ఎస్పీ అన్బురాజన్
– కడప, చెన్నూరులో కర్ఫ్యూను పరిశీలించిన ఎస్పీ
పల్లెవెలుగు వెబ్, కడప: జిల్లా కేంద్రమైన కడప నగరంలోని వై.వి స్ట్రీట్ లో శనివారం మధ్యాహ్నం 12 గంటలకు జిల్లా ఎస్.పి శ్రీ కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ పర్యటించి కర్ఫ్యూ ఆంక్షలు అమలు పరిస్థితిని పరిశీలించారు వై.వి స్ట్రీట్ లో కర్ఫ్యూ పరిస్థితులను వీక్షించారు. అనవసరంగా రోడ్లపైకి రావద్దని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలన్నారు. అన్ని రకాల వ్యాపార దుకాణాలు/ సంస్థలు, కార్యాలయాలు, హోటళ్లు, రెస్టారెంట్లు ఉదయం 6 గంటల వరకు తెరవకుండా చూడాలని పోలీస్ అధికారులకు సూచించారు. అత్యవసర సర్వీసులు, ఆసుపత్రులు, ఫార్మసీలను మినహాయించాలన్నారు. కర్ఫ్యూ ఆంక్షలు పక్కాగా కొనసాగాలని పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా ఎస్.పి వెంట కడప వన్ టౌన్ సి.ఐ టి.వి సత్యనారాయణ ఉన్నారు.
చెన్నూరులో..: కరోనా నేపథ్యంలో అత్యవసరం ఉంటే తప్పా..బయటకు రావద్దని ఎస్పీ అన్బురాజన్ జిల్లా ప్రజలకు సూచించారు. శనివారం ఆయన చెన్నూరు కొత్త రోడ్డు నుండి, పాత రోడ్డు వరకు, వ్యాపార సముదాయాల దుకాణాలను, హోటల్స్ ను పరిశీలించారు. కర్ఫ్యూను పక్కాగా నిర్వహించాలని ఎస్ ఐ, శ్రీనివాసులు రెడ్డి కి సూచించారు. కర్ఫ్యూ అమలు తీరును పరిశీలించిన ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కరోనా నివారణకు జాగ్రత్తలు పాటించాలని ఎస్పీ అన్బురాజన్ ప్రజలకు పిలుపునిచ్చారు.