కర్నూల్లో… ఎస్ పి బాలసుబ్రమణ్యం మ్యూజిక్ పార్క్ ప్రారంభం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: నగరంలోని 44వ వార్డు నందు, కర్నూల్ నగరపాలక సంస్థ నూతనంగా అభివృద్ధి చేసిన ఎస్ పి బాలసుబ్రమణ్యం మ్యూజిక్ పార్క్‌ను, నేడు…కర్నూల్ నగర మేయర్ బి వై రామయ్య , కర్నూల్ పార్లమెంట్ సభ్యులు శ్రీ సంజీవ్ కుమార్ , కర్నూల్ నియోజకవర్గ శాసన సభ సభ్యులు శ్రీ హఫీజ్ ఖాన్, పాణ్యం నియోజకవర్గ గౌరవ శాసన సభ సభ్యులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి , కోడుమూరు నియోజకవర్గశాసన సభ సభ్యులు సుధాకర్ బాబు , కర్నూల్ నగరపాలక సంస్థ కమీషనర్ శ్రీ A.భార్గవ్ తేజ I.A.S. , స్థానిక కార్పొరేటర్ రాజేశ్వర్ రెడ్డి , నగర కార్పొరేటర్లు మరియు మునిసిపల్ ఇంజనీరింగ్ సిబ్బందితో కలసి ప్రారంభించారు.ఈ పార్క్ సంగీత దిగ్గజాల ఎకో ఫ్రెండ్లీ పెయింటింగ్స్ తో పాటు సంగీత వాయిద్యాల ప్రతిమలను కలిగి ఉండడం, మరియు పిల్లలు ఆడుకునే ప్లే ఏరియా తో పాటు పెద్దల శారీరిక ఆరోగ్యం కోసం వ్యాయామ పరికరాలు కలిగి ఉన్నదని, మనసుకు సాంత్వన తో పాటు శారీరిక మరియు మానసిక ఆరోగ్యాన్నీ పెంపొందించుకునేందుకు ఈ పార్కు నగర ప్రజలకు ఎంతో ఉపయోగకరమని మేయర్ శ్రీ బి వై రామయ్య పేర్కొన్నారు.