ఉగాది పురస్కారాలకు ఎంపికైన సేవా పథకాల గ్రహీతలకు ఎస్పీ అభినందనలు
1 min read
కె.ప్రతాప్ శివ కిషోర్ అభినందనలు
ప్రజలకు సమర్థమంతమైన సేవలు అందించేందుకు నిబద్దత్తో పనిచేస్తున్నదే పోలీస్
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ఉగాది పురస్కారాల కు ఎంపికైన సేవా పథక గ్రహీతలకు మరియు ఉత్తమ సేవా గ్రహితలకు ఏలూరు జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ పోలీస్ అధికారులను అభినందనలు తెలియ చేసినారు.ఏలూరు జిల్లా పోలీస్ శాఖ ప్రజలకు సమర్థవంతమైన సేవలను అందించేందుకు నిబద్ధతతో పని చేస్తున్న అధికారులను గుర్తించి, వారి సేవలను ప్రోత్సహించేందుకు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్తమ సేవా పథకాలు ప్రదానం చేయడం జరిగింది. ఈ అవార్డులను అందుకున్న 11 మంది పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్ ఐపీఎస్ హృదయపూర్వక అభినందనలు తెలియ చేసినారు.
సేవా పథకం గ్రహీతలు
ఇన్స్పెక్టర్ ఎం.వి. సుభాస్ – నిడమర్రు సర్కిల్,ఇన్స్పెక్టర్ కె. రామకృష్ణ నూజివీడు రూరల్ సర్కిల్, ఆర్ ఐ జి.ఎస్.పి.ఏ. పవన్ కుమార్ – ఏ.ఆర్ విభాగం,ఏలూరు జిల్లా, హెడ్ కానిస్టేబుల్ 1792 టి.కె. కృష్ణారావు – ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్,పోలీస్ కానిస్టేబుల్ సురేష్ చింతలపూడి పోలీస్ స్టేషన్,కానిస్టేబుల్ ఏ. నాగ బాబు టీ. నర్సాపురం పోలీస్ స్టేషన్,ఏలూరు రోడ్లు పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ 1831. ఎం.వి.ఆర్.ఎస్ నారాయణ,ఏలూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ 210 వెంకటేశ్వరరావు ,ఏ.ఆర్ హెడ్ కానిస్టేబుల్ 1284 పీ చిట్టిబాబు
ఉత్తమ సేవా పథక గ్రహీతలు: హెడ్ కానిస్టేబుల్ 1834 ఎం. శ్రీనివాసరావు – డిసిఆర్బి, ఏలూరు.హెడ్ కానిస్టేబుల్ 226 పి. నాగు ఈ అధికారులు సమాజానికి విశేషమైన సేవలు అందించి, ప్రజల సంక్షేమం కోసం అపూర్వమైన కృషి చేసినందుకు గుర్తింపు పొందారు. ప్రజల రక్షణ, న్యాయం, సామాజిక సమరస్యాన్ని కాపాడే విధంగా బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ అధికారుల సేవా నిబద్ధత, పట్టుదల, క్రమశిక్షణ పోలీస్ శాఖకు గొప్ప గౌరవాన్ని తీసుకువచ్చింది.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ఈ అవార్డులు పోలీస్ అధికారుల కృషికి సూచకంగా నిలుస్తాయి. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఇంకా శ్రద్ధతో, నిబద్ధతతో పనిచేసేందుకు ఇది ప్రేరణగా నిలుస్తుంది అని పేర్కొన్నారు.జిల్లా పోలీసులు ప్రజల భద్రతను కాపాడే విధంగా నిరంతరం కృషి చేస్తూ, న్యాయం, శాంతి, సామాజిక సమరస్యానికి అంకితభావంతో పని చేస్తున్నట్లు ఈ అవార్డుల ద్వారా మరోసారి స్పష్టమైంది. ఈ అవార్డులను అందుకున్న అధికారులకు పోలీస్ శాఖ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము.