ఎస్పీకి.. అంబులెన్స్ బహూకరణ
1 min read– ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డిని సన్మానించిన ఎస్పీ ఫక్కీరప్ప
పల్లెవెలుగు వెబ్, బనగానపల్లె: కరోన విపత్కరకాలంలో పోలీసులు చేస్తున్న సేవలు మరువలేమని, పోలీసుల సంక్షేమార్థం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి అన్నారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్ ఆవరణలో ఎమ్మెల్యే కోట కింద డీఎంఎఫ్ నిధులు రూ. 25లక్షలతో కొనుగోలు చేసిన అంబులెన్స్‌ను ఎస్పీ డా. కాగినెల్లి ఫక్కీరప్పకు ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి బహుకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పోలీస్ యంత్రాంగానికి, పోలీస్ కుటుంబాలకు అత్యవసర సేవలు కొరకు అంబులెన్స్ లేకపోవడంతో ఎస్పీ కాగినెప్పి పక్కిరప్ప విజ్ఞప్తి మేరకు తన ఎమ్మెల్యే కోట ద్వారా 25 లక్షల రూపాయలు మంజూరు చేయించామన్నారు. DMF నిధులు మంజూరు చేయడానికి సహకరించిన జిల్లా కలెక్టర్ వీర పాండ్యన్, జిల్లా మైనింగ్ D. D రాజశేఖర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేశారు. కార్యక్రమం లో బనగానపల్లె సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్ రెడ్డి,జిల్లా పోలీస్ అధికారులు పాల్గొన్నారు.