NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కప్పట్రాళ్ళల్లో.. ఎస్పీ‘పల్లెనిద్ర’

1 min read

గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని యువతకు పిలుపు..

పల్లెవెలుగు వెబ్​: కప్పట్రాళ్ల గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపి… ఆదర్శంగా తీర్చిదిద్దాలని యువతకు పిలుపునిచ్చారు కర్నూలు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్​ ఐపీఎస్​. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కప్పట్రాళ్ల గ్రామంలో సోమవారం రాత్రి ‘పల్లెనిద్ర’ కార్యక్రమంలో భాగంగా గ్రామస్తులతో మాట్లాడారు.  జిల్లా పోలీసు యంత్రాంగం శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో బాగా పని చేస్తుందన్నారు.  బాధిత ప్రజలకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.  దేశంలో ఎక్కడలేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే గ్రామాలు, పట్టణాల అభివృద్ది కి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్ధ  ఎంతో దోహదపడుతుందన్నారు.  ఏవరైనా అక్రమాలు, అవినీతికి పాల్పడితే 14400 నెంబర్ కు  సమాచారం అందించాలన్నారు.

‘దిశా’ యాప్​ డౌన్​ లోడ్​ చేసుకోండి…

దిశా SOS మొబైల్ అప్లికేషన్ మహిళలకు ఏల్లవేళల్లా అండగా ఉంటుందన్నారు. దిశా యాప్ ను  ప్రతి ఒక్కరూ  డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు. సమస్యలు, విభేధాలుంటే పరిష్కరించుకునే విధంగా గ్రామంలో ప్రతి ఒక్కరు సంకల్పం తీసుకోవాలన్నారు.  రెవిన్యూ, పోలీసుతోపాటు అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తాయన్నారు. ఏవరైనా నాటుసారా, అక్రమంగా మద్యం , కర్ణాటక టెట్రా ప్యాకెట్ల ను  వంటి వాటి అక్రమ రవాణాలకు పాల్పడితే కేసులు నమోదు చేసి ఖచ్చితంగా జైలుకి పంపిస్తామన్నారు. యువతకు మంచి అవకాశాలు ఉన్నాయని సద్వినియోగం చేసుకోవాలన్నారు.  గ్రామాన్ని ఆదర్శంగా నిలపాలన్నారు. కలెక్టర్​తో మాట్లాడి గ్రామంలోని సమస్యలను పరిష్కరిస్తామన్నారు. గ్రామ ప్రజల సమస్యలను వెంటనే తన దృష్టికి తీసుకురావాలన్నారు.  సంబంధిత జిల్లా అధికారులతో మాట్లాడి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు.   ఫ్యాక్షన్ జోలికి ఏవరు కూడా వెళ్ళవద్దన్నారు. అసాంఘిక కార్యకాలాపాలకు పాల్పడితే ఎవరిని ఉపేక్షించేది లేదన్నారు.  ఈ పల్లె నిద్ర కార్యక్రమంలో   ఆదోని డిఎస్పీ వినోద్ కుమార్ , ఇంచార్జ్ తహసిల్దార్ సుదర్శనం, ఇంచార్జ్ ఎమ్ పి డిఓ ఇద్రుష్ బాషా, స్పెషల్ బ్రాంచ్ సిఐ ప్రసాద్,  పత్తి కొండ సిఐ రామకృష్ణా రెడ్డి,  ఆదోని తాలుకా సిఐ మహేశ్వరెడ్డి, దేవనకొండ ఎస్సై ఎ.పి శ్రీనివాసులు,  తుగ్గలి ఎస్సై మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

About Author