ఎస్పీ చేతులమీదుగా నవోదయం- ఎన్ఫోర్స్మెంట్ పోస్టర్ విడుదల
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: నవోదయం రెండవ దశ కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పటేల్ ని,జిల్లా ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి యం సుధీర్ బాబు సిఐలు చంద్రహాస్ మరియు రాజేంద్రప్రసాద్ లు కలసి ఎస్పీ చే నవోదయం- ఎన్ఫోర్స్మెంట్ పోస్టర్ ను విడుదల చేయడమైనది. నాటు సారా రహిత జిల్లాగా తయారు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం సంకల్పించిన లక్ష్యానికి చేరుకోవాలని నాటు సారా రహిత జిల్లాగా రూపుదిద్దాలి అంటే ప్రజలందరూ సమిష్టిగా బాధ్యతతో కృషి చేయాలని తెలిపారు. నవోదయం రెండవ దశలో ఎన్ఫోర్స్మెంట్ యాక్టివిటీస్ పై అవగాహన మరియు దాడులు విస్తృతం చేయడమే లక్ష్యంగా పోలీసు వారి యొక్క సహకారాన్ని పూర్తిగా తీసుకోవచ్చు అని హామీ ఇవ్వడం జరిగినది. తదుపరి జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారి సుధీర్ బాబు నవోదయం అమలు దశ మరియు జిల్లా స్థాయిలో కమిటీ ఫర్ ఆల్కహాల్ అవేర్‌నెస్ అండ్ రెస్పాన్సివ్ ఎడ్యుకేషన్ (కేర్) గురించి క్లుప్తంగా ఎస్పీ కి వివరించడమైనది. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా డీఎస్పీ బాబు ప్రసాద్ పాల్గొన్నారు. తదుపరి డి.ఎస్.పి కి నవోదయం విషయంలో పలు సూచనలు చేయడమైనది.