PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎస్పీ సేవలు.. అభినందనీయం

1 min read
ఎస్పీని సత్కరిస్తున్న బీవై రామయ్య

ఎస్పీని సత్కరిస్తున్న బీవై రామయ్య

కర్నూలు నగర మేయర్​ బీవై రామయ్య
పల్లెవెలుగు వెబ్, కర్నూలు కార్పొరేషన్​ : కార్పొరేషన్​, మున్సిపల్​ ఎన్నికలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా.. పకడ్బందీగా విధులు నిర్వర్తించిన జిల్లా ఎస్పీ కాగినెల్లి ఫక్కీరప్పకు అభినందనలు తెలిపారు కర్నూలు నగర మేయర్​ బీవై రామయ్య. కర్నూలు నగర మేయర్​గా బాధ్యతలు స్వీకరించిన బీవై రామయ్య.. శనివారం ఎస్పీ ఫక్కీరప్పను ఆయన ఛాంబరులో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా శాలువాతో సత్కరించి.. మెమోంటో అందజేశారు. అనంతరం ఎస్పీ సేవలను రామయ్య కొనియాడారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కిరప్ప కాగినెల్లి మాట్లాడుతూ నూతన మేయర్ ఎన్నికైన బి.వై. రామయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. కర్నూలు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ డా. ఫక్కీరప్ప ఆకాంక్షించారు.

About Author