ఆర్ఆర్ఆర్ అనర్హత పిటిషన్ పై స్పీకర్ ఆఫీస్ రియాక్షన్ ?
1 min readపల్లెవెలుగువెబ్ : నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అనర్హత పిటిషన్‌పై లోక్‌సభ స్పీకర్ కార్యాలయం స్పందించింది. సీఎం జగన్‌పై పార్టీ ఎంపీ ఆరోపణలు అనర్హత వేటు కిందకు రాదని, పార్టీ విప్‌ను ఉల్లంఘిస్తేనే అనర్హత వేటు కిందకి వస్తుందని స్పీకర్ ఆఫీస్ వెల్లడించింది. సీఎం, మంత్రులను విమర్శిస్తే అనర్హత వేటు కిందకి రాదని, రఘురామ అనర్హత పిటిషన్ ప్రివిలైజ్ కమిటీ ముందు ఉందని, విచారణ ఎప్పుడు పూర్తవుతుందో కమిటీ చెబుతుందని స్పీకర్ కార్యాలయం తెలిపింది. అలాగే టెన్త్ షెడ్యూల్‌లో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, దానిపైన కమిటీ ఏర్పాటు చేశామని, కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందిస్తోందని స్పీకర్ కార్యాలయం పేర్కొంది.