‘డిజిటల్ చెల్లింపులు’ పేరుతో ప్రత్యేక ఏర్పాట్లు
1 min read– ప్రెమెంట్లకు సంబంధించి క్యూఆర్ కోడును తన సొంత సెల్ ఫోనులో స్వయంగా పరిశీలిస్తున్న కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ..
నగదు రహిత లావాదేవీల్ల విషయంలో పోస్టర్ విడుదల..
– నేటి నుంచి అన్ని పంచాయతీలలో నగదు రహిత చెల్లింపులు..
– పంచాయతీ ఆర్ధిక లావాదేవీలలో పారదర్శకత..
ఆస్థి పన్నుతో సహా అన్ని వసూళ్లు నేటి నుంచి డిజిటల్ విధానం..
చెల్లింపు జరిగిన వెంటనే ప్రజలకు రశీదులిచ్చేలా ఏర్పాట్లు..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : 77 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా గ్రామ పంచాతీలలో నేటి నుంచి నగదు రహితంగా వసూళ్లు, చెల్లింపులు చేయనున్నామని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. ఇందు కోసం ‘డిజిటల్ చెల్లింపులు’ పేరుతో ప్రత్యేక ఏర్పాట్లు చేసామన్నారు. ప్రజల నుంచి వివిధ రకాల సేవలకు సంబందించిన వసూళ్లతోపాటు పంచాతీల నుంచి ఇతరులకు చేసే చెల్లింపులకు డిజిటల్ విధానం అమలు చేయనున్నామన్నారు. ఇందుకు సంబందించిన మార్గదర్శకాలను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పంపించగా జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస విశ్వనాధ్ ను కార్యాచరణ చేపట్టామని ఆదేశాలు జరిచేసారు. సందర్బంగా డిపిఓ శ్రీనివాస విశ్వనాధ్ స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా వారి సహకారంతో జిల్లాలో 547 గ్రామ పంచాయతీలలో పంచాయతీ పేరుమీద కరెంట్ అకౌంట్ ఖాతా తెరిపించి డిజిటల్ క్యూఆర్ కోడుకు అనుసంధానం చేయించారు. పంచాయతీలలో 3000 జనాభాకన్నా ఎక్కువ ఉన్న అలాగే ఒక గ్రామ పంచాయతీలో రెండు కన్నా ఎక్కువ గ్రామ సచివాలయాలు ఉన్న పంచాయతీలలో “పాయింట్ అఫ్ సేల్” ద్వారా నగదు రహిత లావాదేవీలు జరిగే విధంగా చర్యలు తీసుకున్నామని డిపిఓ టి శ్రీనివాస విశ్వనాధ్ అన్నారు. ఆస్థి పన్ను, కుళాయి కనెక్షన్ల రుసుములు, వ్యాపార సంస్థలకు అనుమతుల కోసం ఫీజులను పంచాయతీలలో ఇప్పటివరకు నగదు రూపంలో వసూలు చేయడంవలన చాల చోట్ల నిధులు దుర్వినియోగం అవుతున్నాయని, ఈ విషయంలో ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు రావడంతో పంచాయతీలలో డిజిటల్ చెల్లింపులు ఆగష్టు 15 తేదీ నుంచి తప్పనిసరి చేయాలనీ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ & గ్రామీణ అభివృద్ధి శాఖను ఆదేశించడంతో జిల్లాలో అన్ని పంచాయతీలలో డిజిటల్ చెల్లింపులు తప్పనిసరి చెయ్యాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాల మేరకు అన్ని పంచాయతీలలో ప్రజల నుంచి నగదు వసూళ్లు రద్దు చేసి కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశాలు మేరకు డిజిటల్ వసూళ్లకు కార్యాచరణ చేపట్టడం జసరిగిందన్నారు. ప్రభుత్వ లక్ష్యం మేరకు పంచాయతీ ఆర్ధిక లావాదేవీల్లలో పారదర్శకత తీసుకురావడమే డిజిటల్ వసూళ్లు, చెల్లింపుల ముఖ్య ఉద్దేశమని కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ అన్నారు. సందర్భంగా సోమవారం గోదావరి సమీక్షా మామావేశంలో కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ డిజిటల్ ప్రెమెంట్సుపై పోస్టర్ విడుదల చేసి స్వయంగా క్యూఆర్ కోడును తన సెల్ ఫోన్ ద్వారా పరిశీలించారు. సందర్బంగా జిల్లా గ్రామీణ ప్రాంత ప్రజలకు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వి.లావణ్య వేణి , జిల్లా పరిషత్ సీఈఓ రవికుమార్, డి.ఆర్.ఓ ఏ.వి. ఎన్ఎస్ మూర్తి, పీడీ డీఆర్డీఏ విజయరాజ్, లీడ్ బ్యాంకు మేనేజర్ నీలగిరి, స్టేట్ బ్యాంకు మేనేజర్ వీరయ్య తదితరులు పాల్గొన్నారు.