తాగు నీటి ఎద్దడి ఏర్పడకుండా మున్సిపల్ కమిషనర్ ప్రత్యేక దృష్టి
1 min readకర్నూల్ నగర ప్రజలు తాగు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడకుండా ప్రత్యేక దృష్టి సారించి, చర్యలు తీసుకున్న కర్నూల్ నగర మునిసిపల్ కమిషనర్ శ్రీ A. భార్గవ్ తేజ I.A.S.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: సుంకేసుల జలాశయంలో నీటి మట్టం అడుగంటడంతో, నగర ప్రజలు తాగు నీటి ఎద్దడిని ఎదుర్కునే క్లిష్ట పరిస్థితిని ముందుగానే గుర్తించి, కర్నూల్ నగర మునిసిపల్ కమిషనర్ శ్రీ A. భార్గవ్ తేజ I.A.S., నిర్ణయాత్మక ప్రత్యామ్న్యా చర్యలు చేపట్టారు. మునిసిపల్ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించగా మూడు రోజుల పాటు నిర్విరామంగా 70 కిలోమీటర్ల మేర కెనాల్ లోని అడ్డంకులను తలగింపచేస్తూ, గాజుల దీన్నే ప్రాజెక్ట్(జీడీపీ) జలాశయం నుండి మునగాలపాడు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కు నీటి ప్రవాహాన్ని కర్నూల్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు విజయవంతంగా మళ్లించారు. జీడీపీ నుండి విడుదల చేయించిన 30 క్యూసెక్కుల నీటి ప్రవాహానికి ఇవాళ జి సింగవరం వద్ద పూజలు నిర్వహించి, హారతినిస్తూ, కర్నూల్ నగర మునిసిపల్ కమిషనర్ శ్రీ A. భార్గవ్ తేజ I.A.S., స్వాగతించారు . కార్యక్రమంలో DEE రవి ప్రకాష్ నాయుడు , AE జనార్దన్ , AE ప్రవీణ్ , తదితరులు పాల్గొన్నారు.