రక్తహీనత నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
1 min read– ఇంటింటికీ కరపత్రాలు అందించి ప్రజల్లో రక్తహీనత నివారణపై అవగాహన కల్పించాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : జిల్లాలో పిల్లలు,బాలికలు, గర్భవతులు, మహిళల్లో రక్తహీనత నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన సంబంధిత అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో “రక్తహీనత-నివారణ”కరపత్రాలను జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, అధికారులు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కర్నూలు జిల్లా లో రక్తహీనత కలిగిన వారు ఎక్కువగా ఉన్నారన్నారు.. ఇంటింటికీ కరపత్రాలు అందించి ప్రజల్లో రక్తహీనత నివారణపై విస్తృతంగా అవగాహన కల్పించాలని, అదే విధంగా వైద్య,మహిళా శిశు సంక్షేమ, విద్యా,సంక్షేమ శాఖల అధికారులు ఈ అంశంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పిల్లలు,గర్భవతులు, మహిళలు,విద్యార్థులకు తగిన పోషకాహారాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఇంటింటి సర్వే నిర్వహించి గర్భవతులకు,పిల్లలు,మహిళలు, విద్యార్థులకు రక్త పరీక్షలు నిర్వహించి రక్తహీనత ఉన్న వారిని గుర్తించి తగిన చికిత్స, ఐరన్ ఫోలిక్ యాసిడ్ వంటి విటమిన్ మాత్రలు అందించి రక్తహీనత నివారణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ట్రైనింగ్ సెంటర్ ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మీ నరసయ్య, డాక్టర్ నిర్మల,CHV సూపర్వైజర్ నాగమణి, తదితరులు పాల్గొన్నారు.