PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బాల్య వివాహాల నిర్మూలనపై ప్రత్యేక అవగాహన

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడి ఆదేశాల మేరకు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీ సి.హెచ్.వెంకట నాగ శ్రీనివాస రావు గారు బాల్య వివాహాల నిర్మూలనపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం సంబంధిత శాఖల సమన్వయంతో న్యాయ సేవ సదన్ నందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాల్య వివాహా నిరోధక చట్టం గురించి తెలియజేశారు, వివాహానికి బాలికలకు 18 సంవత్సరాలు, బాలురకు 21 సంవత్సరాలు దాటి ఉండవలెను. ఈ చట్టం ప్రకారం ఎవరైనా పురుషుడు 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న మైనర్ బాలికను వివాహం చేసుకొని, తనతో సంసారం చేసినట్లైతే బాల్య వివాహ చట్టం 2006, పోక్సో చట్టం 2012 & సవరణ చట్టం 2019 మరియు వాటికి ఎలాంటి శిక్షలు విధించబడును గురించి తెలియజేశారు. పెళ్లి చేసుకునే వారు, పెళ్లి చేయించేవారు, పెళ్ళికి హాజరు అయిన వారు కూడా శిక్షకు అర్హులు. మైనర్ బాలికను వివాహం చేసుకున్న వరుడికి రెండు సంవత్సరాల జైలు శిక్ష లేదా ఒక లక్ష రూపాయలు లేదా రెండు కలిపి కూడా విధించబడును, వాళ్ళ తల్లిదండ్రులకు మరియు బంధువులకు రెండు సంవత్సరాల వరకు కఠిన కారాగార శిక్ష మరియు ఒక లక్ష రూపాయల జరిమాన విధించబడుతుంది. ఈ కార్యక్రమంలో శ్రీమతి కే.ఆర్.ఎల్.కే. కుమారి, జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ & సాధికారత అధికారి, శ్రీ ఆదిశేషు నాయుడు, జిల్లా ఎండోమెంట్ అధికారి, శ్రీ జి. తిరుపతి రావు, రాష్ట్ర కో ఆర్డినేటర్, బచ్‌పన్ బచావో ఆందోళన్ ఈ సమావేశంలో పాల్గొని దేవాలయాలలో నోటీసు బోర్డుల యందు బాల్య వివాహ నిరోధ చట్టం ప్రకారం విధించే శిక్షలు గురించి ప్రదర్శన చేస్తామన్నారు, తల్లిదండ్రులు, సంరక్షకులు, మరే ఇతర వ్యక్తులు, బాల్య వివాహాన్ని ప్రోత్సహించిన, సంరక్షించే బాధ్యతను కలిగిన, గంబీరంగా నిర్వహించేందుకు అనుమతించిన శిక్షకు అర్హులు. సంబంధిత వివాహాల నిరోధక అధికారులు (సి‌.ఎం‌.పి.‌ఓ. లు) మరియు ఇతర శాఖాధికారులు, బాల్య వివాహం నిలుపుదల చేసే సమయంలో శిక్షలను తెలియజేస్తూ రాసిన అంగీకార పత్రములను తప్పని సరిగా వరుడు, వరుడి తల్లిదండ్రులు, వధువు తల్లిదండ్రుల సంతకంతో విడివిడిగా తీసుకున్నట్లయితే చాలా వరకు బాల్య వివాహాలను అరికట్టవచ్చునని భావించడమైనది. ఈ బాల్య వివాహాలు ఎక్కడ జరిగిన వెంటనే సంబంధిత శాఖల వారికి తెలియజేయవలసినదిగా కొరడమైనది లేదా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సంప్రదించిన సమర్థమైన న్యాయం అందించబడును. ఈ కార్యక్రమంలో పురోహితులు, చర్చ్ పాస్టర్లు, గ్రామ వార్డు సచివాలయం మహిళా పోలీసులు, సంబందిత శాఖ వారందరూ పాల్గొనారు.

About Author