PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కళాకారుల సంక్షేమ సంఘ అభివృద్ధికి విశేష కృషి

1 min read

పల్లెవెలుగు, వెబ్ ఏలూరు : సకల కళాకారుల సంక్షేమ సంఘ అభివృద్ధికి విశేషంగా కృషి చేద్దామని సంఘ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు శలా కోటి వీరయ్య అన్నారు. పట్టణంలోని గుణం వేణుగోపాల్ ఫంక్షన్ హాల్లో ఆదివారం రాత్రి సకల కళాకారుల సంక్షేమ సంఘం జిల్లా సమావేశం, వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షుడు వైబోయిన బాబులు, రాష్ట్ర మహిళా కార్యదర్శి సీహెచ్వీ లక్ష్మీకుమారి పర్యవేక్షించారు. నటరాజు నృత్య కళానికేతన వారిచే చిన్నారులతో నృత్య ప్రదర్శనలు, ఏక పాత్రాభినయాలు, అనుకరణ నృత్యాలు నిర్వహిం చారు. సాంస్కృతిక, ట్రాక్ సింగింగ్, భజన కార్యక్ర మాలు నిర్వహించారు. ప్రముఖులను ఘనంగా సత్కరించారు. కళాకారులకు ప్రశంస పత్రాలు అం దజేశారు. ఏపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రాజేశ్వ రి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దువ్వి రామారావు, కోశా ధికారి హేమ సుందర్, పశ్చిమ, ఏలూరు, రాజమం డ్రి జిల్లాల నుంచి కళాకారులు హాజరయ్యారు.

About Author