PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విద్య.. వైద్యం.. వ్యవసాయంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

1 min read

– ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్య, వైద్యం, వ్యవసాయం పై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందని, రైతుల పై, విద్యార్థుల పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరుగుతుందని ఎమ్మెల్యే పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు, బుధవారం ఆయన మండలంలోని ఓబులంపల్లె, రామనపల్లి లో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రాన్ని, అలాగే వైయస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ ను ఆయన తన తనయులు చింతకొమ్మదిన్నె జెడ్పిటిసి పోచం రెడ్డి నరేన్ రామాంజనేయులు రెడ్డి తో కలిసి ప్రారంభించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు సుభిక్షంగా ఉంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్న లక్ష్యంతోనే ప్రభుత్వం రైతుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ఆయన తెలిపారు, దీనికోసం ఆయన రైతు భరోసా కేంద్రాలను తీసుకురావడం జరిగిందని తెలిపారు, రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేయడమే కాకుండా రైతుకు సంబంధించిన భూమి మట్టి నమూనా మొదులుకొని రైతులకు కావలసిన నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు, వ్యవసాయ పనిముట్లు, ఎరువులు తోపాటు, రైతులకు ఏ కాలంలో ఏ పంటలు వేస్తే మంచి దిగుబడి వస్తుందో శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు రైతులకు సూచించడం జరుగుతుందన్నారు, రైతు పంట మొదలుకొని రైతుకు గిట్టుబాటు ధర వచ్చేంతవరకు ప్రభుత్వం అన్ని రకాల సేవలను అందించడం జరుగుతుందన్నారు, ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టడం ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికే సాధ్యమైందని ఆయన అన్నారు, అనంతరం చింతకొమ్మదిన్నె జెడ్పిటిసి నరేన్ రామాంజనేయులు రెడ్డి మాట్లాడుతూ, 2 వేల జనాభా కలిగిన గ్రామాలలో వైయస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్లు ఏర్పాటు చేసి ప్రజలు బయటికి వెళ్లకుండా వైయస్సార్ విలేజ్ హెల్త్ క్లినికల్ ద్వారా మెరుగైన వైద్యం అందించడం జరుగుతుందన్నారు, అంతేకాకుండా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సచివాలయాలతోనే సాధ్యమని భావించి ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు సచివాలయాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు, దీని ద్వారా ఎక్కడ కూడా లంచం లేకుండా, ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ప్రతి సర్టిఫికెట్ వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇంటికి వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు, ఇలాంటి గొప్ప బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టడం గొప్ప సాహసమే అని చెప్పాలని ఆయన అన్నారు, ముఖ్యంగా ఇక్కడ ఉన్న వైయస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలని ఆయన తెలియజేశారు, గతంలో లాగా కాకుండా విద్య కు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం అంతా ఇంత కాదన్నారు, విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహార భోజనంతోపాటు, ఉచితంగా పార్టీ పుస్తకాలు, నోట్ బుక్ లు, పెన్నులు, స్కూల్ బ్యాగులు, షూస్ తో సహా ఇవ్వడమే కాకుండా విద్యార్థిని స్కూలుకు పంపిస్తే చాలు ఆ విద్యార్థి తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలో 15 వేల రూపాయలు జమ చేయడం జరుగుతుందన్నారు, అలాగే నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ పాఠశాలలు తలదన్నే లా తీర్చిదిద్దడం జరిగిందన్నారు, ఇంతలా ప్రజల కోసం ఆలోచించే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నే అని ఆయన అన్నారు, ఈ కార్యక్రమంలో, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ మాసిమ బాబు, వైఎస్ఆర్సిపి జిల్లా ఉపాధ్యక్షులు గుమ్మ రాజేంద్రప్రసాద్ రెడ్డి, రాష్ట్ర చిన్న పరిశ్రమల శాఖ డైరెక్టర్, చల్ల వెంకటసుబ్బారెడ్డి, సర్పంచ్ చల్ల ప్రమీల, రాష్ట్ర అటవీ శాఖ డైరెక్టర్ శ్రీలక్ష్మి,,రామన చంద్ర మోహన్ రెడ్డి, మాజీ మండల ఉపాధ్యక్షులు సొంట్టం చంద్రబాబు రెడ్డి, చల్లా అన్వేష్ రెడ్డి, చల్లా శివారెడ్డి, కమలాకర్ రెడ్డి, సాగర్ రెడ్డి, ఎంపీటీసీ సుబ్బ లక్ష్మమ్మ, మల్లికార్జునరెడ్డి, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ జి ఎన్ భాస్కర్ రెడ్డి, సొసైటీ చైర్మన్ అల్లి శ్రీరామమూర్తి, ముదిరెడ్డి రవిరెడ్డి,సొంట్టం నారాయణరెడ్డి, ఎర్రసాని నిరంజన్ రెడ్డి, అధికారులు ఎంపీడీవో సుబ్రహ్మణ్యం శర్మ, డాక్టర్ బి చెన్నారెడ్డి, మండల వ్యవసాయ అధికారి శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు.

About Author