జగనన్న కాలనీల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి
1 min readపల్లెవెలుగు అన్నమయ్య జిల్లారాయచోటి : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని రాయచోటి ఎం పి డి ఓ మల్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఎం పి డి ఓ కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగనన్న కాలనీలో గృహాల లబ్ధిదారులతో సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి గృహ నిర్మాణాలు త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎం పి పి పోలు సుబ్బారెడ్డి, హోసింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ గోపాల్ నాయక్ గారు హౌసింగ్ అసిస్టెంట్ ఇంజినీర్ వెంకటేష్ గారు పంచాయతీ కార్యదర్సులు మరియు జగనన్న కాలనీకి నియమించిన ప్రత్యేక అధికారులు మరియు ఇంజినీరింగ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.