కర్నూలు నగర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు: జిల్లా కలెక్టర్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నగర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు పేర్కొన్నారు.శనివారం కలెక్టరేట్లోని మినీ కన్ఫరెన్స్ హాల్ నందు కర్నూలు మునిసిపల్ కమిషనర్ భార్గవ్ తేజ మరియు జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ తో కలిసి కర్నూలు స్మార్ట్ సిటీ మిషన్ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు నిర్వహించారు.ఈ సందర్భంగా కర్నూలు స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో బిర్లా గేట్ ఫ్లై ఓవర్ క్రింద భాగంలో రూ.1.83 కోట్ల వ్యయంతో కె-3 (కర్నూలు ఖానా ఖజానా) ఈట్ స్ట్రీట్ పనుల పురోగతి పై కలెక్టర్ అరా తీశారు. మునిసిపల్ కమిషనర్ స్పందిస్తూ ఇప్పటివరకు 1.50 కోట్ల రూపాయలకు సంబంధించిన పనులు పూర్తి చేశామని, ఈట్ స్ట్రీట్ కి సంబంధించి మిగిలిన పనులకు నిధులు విడుదల చేసేందుకు కర్నూలు స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ అప్రూవల్ కావాలని కలెక్టర్ దృష్టికి తెచ్చారు.. అందుకు సంబంధించిన ప్రతిపాదన లకు కమిటీ ఆమోదం తెలిపింది.. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.