ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు
1 min readనగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్ర బాబు
నగరంలో అధికారులతో కలిసి కమిషనర్ పర్యటన
కార్తీక దీపోత్సవ ఏర్పాట్లు పరిశీలన
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు నగరపాలక కమిషనర్ ఎస్.రవీంద్రబాబు తెలిపారు. బుధవారం నగరపాలక, పోలీసు అధికారులతో కలిసి గాయత్రీ ఎస్టేట్, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, రాజ్ విహార్, ఆనంద్ టాకీస్ ప్రాంతాల్లో కమిషనర్ పర్యటించారు. అలాగే కేసి కెనాల్ వద్ద శుక్రవారం నిర్వహించనున్న కార్తీక దీపోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను, పాత క్రిష్ణనగర్ రైల్వే బ్రిడ్జి ప్రదేశాన్ని కమిషనర్ పరిశీలించారు.గాయత్రీ ఎస్టేట్ కూడలి వెడల్పు తగ్గించుటకు, రాజ్ విహార్ నందు వాటర్ ఫౌంటెన్ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రి వద్ద చెట్టు కొమ్మలు తొలగించాలని సూచించారు. ఆనంద్ టాకీస్ వద్ద మరో కూడలి ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కమిషనర్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో ట్రాఫిక్ రద్దీ నివారణకు సంబంధించి రహదారుల భద్రత కమిటీ సూచనల మేరకు, పలు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆనంద్ టాకీస్ వద్ద మరో కూడలి ఏర్పాటు చేస్తామని, తద్వారా బస్టాండ్ వైపు నుండి వచ్చే వాహనాలు కిసాన్ ఘాట్, వినాయక ఘాట్ వైపునకు మళ్ళించవచ్చన్నారు. ఫలితంగా రాజ్ విహర్ వద్ద ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని పేర్కొన్నారు. కె.సి. కెనాల్ వినాయక ఘాట్ వద్ద శుక్రవారం జరిగే కార్తీక దీపోత్సవానికి సంబంధించి పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కమిషనర్ వెల్లడించారు. పాత క్రిష్ణనగర్ రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద మురుగు కాలువ నీరు లీకేజీతో బ్రిడ్జి కింద మురుగునీరు చేరుతుందనే విషయం తెలిసిన వెంటనే, తాత్కాలికంగా పరిష్కారించామన్నారు. వారంలో సమస్యను శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.కార్యక్రమంలో ఆరోగ్యధికారి డా. కె.విశ్వేశ్వర్ రెడ్డి, సిఐలు మన్సురుద్దీన్, హుస్సేన్, ఎంఈ సత్యనారాయణ, డిఈఈలు మనోహర్ రెడ్డి, క్రిష్ణలత బిల్డింగ్ సూపర్వైజర్ దామోదర్, బిల్డింగ్ ఇంస్పెక్టర్లు అంజాద్ బాష, దివాకర్, శానిటేషన్ ఇంస్పెక్టర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.