శ్రీశైలంలో ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా ప్రత్యేక చర్యలు…
1 min read
ట్రాఫిక్ పై ప్రత్యేక నిఘా కొరకు 03 డ్రోన్ కెమెరాల వినియోగం….
ట్రాఫిక్ నియంత్రణకు 15 బ్లూ కోట్స్ వాహనాలు 10 రక్షక్ వాహనాల ఎర్పాటు….
సాంకేతిక కారణాలతో నిలిచిపోయిన వాహనాల తొలగింపునకు టోయింగ్ వెహికల్స్ ఏర్పాటు….
నంద్యాల జిల్లా ఎస్పీ శ అదిరాజ్ సింగ్ రాణా
నంద్యాల , న్యూస్ నేడు: నంద్యాల జిల్లా శ్రీశైలంలో ఉగాది మహోత్సవాల సంధర్భంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దర్శన నిమిత్తం శ్రీశైలంనకు వచ్చు భక్తులకు ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూసేందుకు నంద్యాల జిల్లా అదిరాజ్ సింగ్ రాణా ఆదేశాలమేరకు ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ దిశా నిర్దేశం చేయడం జరిగింది.శ్రీశైలం శిఖరం వద్ద నుండి వద్ద నుండి ముఖద్వారం, సాక్షి గణపతి, హటకేశ్వరం,రామయ్య టర్నింగ్ టోల్గేట్ మరియు శ్రీశైలం లోని పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా 15 బ్లూ కోర్ట్ వాహనాలను మరియు 10 రక్షక్ వాహనాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వాహనాలు నిరంతరం మూవింగ్ చేస్తూ ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.ఎక్కడ ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం మరియు ఇతర అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేయడం జరిగింది.ముఖ్యమైన కూడళ్ల యందు పికెట్స్ లను ఏర్పాటు చేయడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ కొరకు సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది.ఏదైనా సాంకేతిక కారణం వల్ల నిలిచిపోయి ట్రాఫిక్ అడ్డంగా ఉన్న వాహనాలను తొలగించడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టోయింగ్ వాహనం ద్వారా ఇతర ప్రాంతాలకు తొలగించడం జరుగుతుంది.ట్రాఫిక్ నియంత్రణకు సరిపడా సిబ్బందితోపాటు ఇద్దరు డిఎస్పీ లతోపాటు 12 మంది ఇన్స్పెక్టర్లను ఏర్పాటు చేయడం జరిగింది.
