ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు
1 min readపల్లెవెలుగు, వెబ్ మహానంది : విద్యుత్ శాఖలో ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఆ శాఖ ఈ ఈ రమణారెడ్డి పేర్కొన్నారు .మహానంది మండలం బుక్కాపురం విద్యుత్ సబ్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన ప్రమాదాల నివారణ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఏటా దేశవ్యాప్తంగా 1500 నుండి 2500 మంది విద్యుత్ ప్రమాదాలతో దెబ్బతింటున్నట్లు తెలిపారు .ప్రమాదాల నివారణ మన రాష్ట్రం పదవ స్థానంలో ఉన్నట్లు తెలిపారు .సబ్ స్టేషన్ లో పనిచేసే సిబ్బంది విద్యుత్తు ఆఫ్ ఆన్ చేసే సమయం తో పాటు విద్యుత్కు అంతరాయం కలిగినప్పుడు పొలాల్లో గ్రామాల్లో అక్కడ విద్యుత్ శాఖ సిబ్బంది పనిచేసే సమయంలో విద్యుత్ విడుదల మరియు నిలుపుదల విషయంలో జాగ్రత్తలు తీసుకోకుంటే పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉందన్నారు .కింది స్థాయి సిబ్బంది మరియు వారిపై పర్యవేక్షణ చేసే వారు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మనుషులతో పాటు పశువులు కూడా విద్యుత్ ప్రమాదంలో దెబ్బతినే అవకాశం ఉందన్నారు ఏవైనా సమస్యలు తలెత్తినప్పుడు అధికారుల సూచనలు సలహాలు తీసుకొని తప్పక పాటించాలన్నారు.అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి వన భోజన కార్యక్రమంలో సిబ్బందితో కలిసి పాల్గొన్నారు .ఈ కార్యక్రమానికి కంటే ముందు హయగ్రీవ ఆచారితో కార్తీక మాసం విశిష్టత గురించి ఆయనతో ఉపన్యాసం గావించారు .కార్యక్రమం అనంతరం హయగ్రీవ ఆచారిని దుశ్యాలువతో సత్కరించారు .ఈ కార్యక్రమంలో కోవెలకుంట్ల డివిజన్ ఏడి ఖాజావలి నంద్యాల ఏఈ శ్రీనివాసులు మహానంది మండల ఏఈ ప్రభాకర్ రెడ్డి ఎంపీపీ ఎస్ఎస్విని మహానంది దేవస్థానం చైర్మన్ మహేశ్వర్ రెడ్డి గాజులపల్లి రవి తదితరులు పాల్గొన్నారు.